Telugu Global
International

24 గంటల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేసిన ఆఫ్ఘన్ దళాలు

దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదుల దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నడుం భిగించింది. గడచిన 24 గంటల్లో నిర్వహించిన ఒక స్పెషల్ ఆపరేషన్‌లో 109 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆ మేరకు ఆఫ్ఘన్ రక్షణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. నిత్యం ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లతో ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతోంది. ప్రజలు అసలు శాంతి అంటే ఏమిటో కూడా మరిచి పోయి ఏండ్లు గడచిపోయాయి. దీనికి తోడు తాలిబాన్లకు విదేశీ శక్తులు కూడా సహకరిస్తుండటంతో ఎలాగైనా వీరందరినీ […]

24 గంటల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేసిన ఆఫ్ఘన్ దళాలు
X

దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదుల దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నడుం భిగించింది. గడచిన 24 గంటల్లో నిర్వహించిన ఒక స్పెషల్ ఆపరేషన్‌లో 109 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆ మేరకు ఆఫ్ఘన్ రక్షణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

నిత్యం ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లతో ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతోంది. ప్రజలు అసలు శాంతి అంటే ఏమిటో కూడా మరిచి పోయి ఏండ్లు గడచిపోయాయి. దీనికి తోడు తాలిబాన్లకు విదేశీ శక్తులు కూడా సహకరిస్తుండటంతో ఎలాగైనా వీరందరినీ ఒకే సారి చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అత్యంత సుశిక్షితులైన బలగాలతో పాటు, వైమానిక దళాలను కూడా రంగంలోకి దింపింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని 15 ప్రావిన్స్‌లలో ఒకే సారి 18 ఆపరేషన్లు చేపట్టినట్లు రక్షణ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 109 మంది చనిపోగా 45 మందికి పైగా ఉగ్రవాదులు గాయపడినట్లు వెల్లడించింది. వీరితో పాటు మరో ఐదుగురిని భద్రతా దళాలు అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపింది.

First Published:  24 Dec 2019 3:30 AM GMT
Next Story