Telugu Global
NEWS

విండీస్ పై పదో సిరీస్ నెగ్గిన భారత్

2019 సీజన్ ను విజయంతో ముగించిన విరాట్ సేన 2019 క్రికెట్ సీజన్ ను విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు అత్యంత విజయవంతంగా ముగించింది. వెస్టిండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకొంది. కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ డిసైడర్ లో భారత్ ను కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుండి గెలిపించాడు. ప్రపంచ క్రికెట్లో చేజింగ్ కింగ్ తానేనని మరోసారి చాటుకొన్నాడు. చెక్కుచెదరని 17 ఏళ్ల రికార్డు.. వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 17 […]

విండీస్ పై పదో సిరీస్ నెగ్గిన భారత్
X
  • 2019 సీజన్ ను విజయంతో ముగించిన విరాట్ సేన

2019 క్రికెట్ సీజన్ ను విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు అత్యంత విజయవంతంగా ముగించింది. వెస్టిండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకొంది.

కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ డిసైడర్ లో భారత్ ను కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుండి గెలిపించాడు. ప్రపంచ క్రికెట్లో చేజింగ్ కింగ్ తానేనని మరోసారి చాటుకొన్నాడు.

చెక్కుచెదరని 17 ఏళ్ల రికార్డు..

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 17 సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓటమి ఎరుగని భారత్..మరోసారి ఆధిపత్యాన్ని చాటుకొంది. భారత గడ్డపై కరీబియన్ టీమ్ ప్రత్యర్థిగా 10వ ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకొంది.

సిరీస్ సొంతం కావాలంటే నెగ్గితీరాల్సిన ఆఖరాటలో భారత్ టాస్ నెగ్గి…ముందుగా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ టీమ్ కు కెప్టెన్ పోలార్డ్, యువఆటగాడు నికోలస్ పూరన్ అద్దిరిపోయే హాఫ్ సెంచరీలతో 300కు పైగా స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించారు. కరీబియన్ టీమ్ 5 వికెట్లకు 315 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

రోహిత్- రాహుల్ జోరు…

316 పరుగుల భారీ విజయలక్ష్యంతో చేజంగ్ కు దిగిన భారత్ కు…ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- రాహుల్ సెంచరీ భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

రోహిత్ 63, రాహుల్ 77 పరుగుల స్కోర్లకు వెనుదిరిగిన తర్వాత…జట్టు గెలుపు భారాన్ని కొహ్లీ తన భుజాలపైన వేసుకొన్నాడు. మిడిలార్డల్లో అయ్యర్, పంత్, కేదార్ జాదవ్ విఫలమైనా…జడేజా తోడుగా కొహ్లీ చెలరేగిపోయాడు.

కేవలం 81 బాల్స్ లోనే 9 బౌండ్రీలతో 85 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కొహ్లీ సెంచరీకి చేరువై మరోసారి అవుట్ కావడంతో..జడేజా- శార్దూల్ జంట బాధ్యాతాయుతంగా ఆడి తమ జట్టుకు 48.4 ఓవర్లలోనే 4 వికెట్ల విజయం ఖాయం చేశారు. జడేజా 39, శార్దూల్ 17 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

First Published:  22 Dec 2019 10:18 PM GMT
Next Story