Telugu Global
Cinema & Entertainment

అనుపమకు మరో అవకాశం

ఫేడవుట్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోవడానికి ఎంతో దూరంలో లేదు అనుపమ పరమేశ్వరన్. మొన్నటివరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ, సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో కూడా కనిపించడం తగ్గించేసింది. రాక్షసుడు సినిమా చేసినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బెల్లంకొండ కొట్టేశాడు. అనుపమకు వచ్చింది చాలా తక్కువ. అలా రాక్షసుడు సినిమా తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మకు ఎట్టకేలకు మరో ఛాన్స్ దక్కింది. ఈసారి నిఖిల్ సరసన […]

అనుపమకు మరో అవకాశం
X

ఫేడవుట్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోవడానికి ఎంతో దూరంలో లేదు అనుపమ పరమేశ్వరన్. మొన్నటివరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ, సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో కూడా కనిపించడం తగ్గించేసింది. రాక్షసుడు సినిమా చేసినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బెల్లంకొండ కొట్టేశాడు. అనుపమకు వచ్చింది చాలా తక్కువ.

అలా రాక్షసుడు సినిమా తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మకు ఎట్టకేలకు మరో ఛాన్స్ దక్కింది. ఈసారి నిఖిల్ సరసన ఈమె అవకాశం దక్కించుకుంది. త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 సినిమా చేయబోతున్నాడు నిఖిల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. పీపుల్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

అనుపమకు తెలుగులో లక్ కలిసిరాలేదు. ఆమెకు స్టార్ హీరోల సరసన ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. దీంతో మలయాళం ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది ఈ బ్యూటీ. ఓ తమిళ సినిమా కూడా చేస్తోంది. ఇలాంటి టైమ్ లో కార్తికే-2 ఆఫర్ వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే తెలుగులో ఆమె కెరీర్ మరోసారి ఊపందుకుంటుంది.

First Published:  23 Dec 2019 4:00 AM GMT
Next Story