Telugu Global
National

తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.... రేసులో ఉంది వీళ్ళేనా?

తెలంగాణ బీజేపీలో అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి ఇవ్వబోతున్నారా? అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో లక్ష్మణ్ ను బీజేపీ మార్చబోతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చి ఈసారి ఫైర్ బ్రాండ్ గల నేతకు బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు యోచిస్తోందట. ఇందులో భాగంగానే వలసవచ్చినవారు.. పార్టీని నమ్ముకుని ఉన్నవారిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ నాయకత్వం ప్రధానంగా నలుగురు ఐదుగురు నేతల విషయంలో ప్రధానంగా […]

తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.... రేసులో ఉంది వీళ్ళేనా?
X

తెలంగాణ బీజేపీలో అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి ఇవ్వబోతున్నారా? అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో లక్ష్మణ్ ను బీజేపీ మార్చబోతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చి ఈసారి ఫైర్ బ్రాండ్ గల నేతకు బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు యోచిస్తోందట. ఇందులో భాగంగానే వలసవచ్చినవారు.. పార్టీని నమ్ముకుని ఉన్నవారిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

పార్టీ నాయకత్వం ప్రధానంగా నలుగురు ఐదుగురు నేతల విషయంలో ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలిసింది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఉద్యమబాట పట్టిన డీకే అరుణ, ఎంపీలు బండి సంజయ్, డి. అరవింద్ ల పేర్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి.

ఈ ముగ్గురిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం 25 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల నుంచి బీజేపీలోకి వచ్చి చురుకైన నేతగా ఎదిగారు. డీకే అరుణ, అరవింద్ లు బీజేపీలోకి కొత్తగా ప్రవేశించిన వారే. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని బీజేపీ కొత్తసారధిని చేస్తారనేది బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఏపీ బీజేపీ విషయానికి వస్తే ప్రధానంగా సుజనాచౌదరి, సీఎం రమేశ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కాకుంటే బీజేపీని నమ్ముకొని ఉన్న జీవీఎల్ నరసింహారావు, సోము విర్రాజు, మణిక్యాల రావులకు చాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు.

First Published:  22 Dec 2019 1:24 AM GMT
Next Story