Telugu Global
NEWS

టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ శుభవార్త.... కానీ....

తెలంగాణలో నామినేటెడ్ పోస్టులకు వేళైంది. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక పదవుల పందేరంలో అంతులేని జాప్యం చేస్తున్న కేసీఆర్ తాజాగా నామినేటెడ్ పోస్టుల జాతరను చేయబోతున్నాడని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వార్త టీఆర్ఎస్ వర్గాల్లో జోష్ నింపుతోంది. కేసీఆర్ వచ్చే ఫిబ్రవరిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కేటీఆర్ చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన వారికే ఈ […]

టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ శుభవార్త.... కానీ....
X

తెలంగాణలో నామినేటెడ్ పోస్టులకు వేళైంది. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక పదవుల పందేరంలో అంతులేని జాప్యం చేస్తున్న కేసీఆర్ తాజాగా నామినేటెడ్ పోస్టుల జాతరను చేయబోతున్నాడని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వార్త టీఆర్ఎస్ వర్గాల్లో జోష్ నింపుతోంది.

కేసీఆర్ వచ్చే ఫిబ్రవరిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కేటీఆర్ చర్చలు జరిపినట్టు తెలిసింది.

అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన వారికే ఈ పదవులు దక్కబోతున్నాయని కండీషన్ పెట్టారట… ఎవరు బాగా పనిచేస్తే వారికే పోస్టులు దక్కుతాయని సమాచారం.

ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఆ రోజున నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారని తెలిసింది. టీఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ లో జరుగుతుంది. ఆలోపు మొత్తం నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ గులాబీశ్రేణులకు బహుమతిగా ఇస్తాడని సమాచారం. కులం, మతం, సామాజికవర్గాల కోణంలో కేసీఆర్ ఈ పదవులు భర్తీ చేయబోతున్నాడని తెలిసింది.

First Published:  22 Dec 2019 6:34 AM GMT
Next Story