Telugu Global
Cinema & Entertainment

ధూమ్ తరహాలో నాని సినిమా

తన కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు నాని. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలోనే 25వ సినిమా చేస్తున్నాడు. V అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో న్యూస్ బయటకు వచ్చింది. V అనే సినిమాను ధూమ్ సిరీస్ తరహాలో తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ గా, నాని విలన్ గా కనిపిస్తారట. […]

ధూమ్ తరహాలో నాని సినిమా
X

తన కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు నాని. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలోనే 25వ సినిమా చేస్తున్నాడు. V అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో న్యూస్ బయటకు వచ్చింది. V అనే సినిమాను ధూమ్ సిరీస్ తరహాలో తెరకెక్కించబోతున్నారట.

ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ గా, నాని విలన్ గా కనిపిస్తారట. సినిమాకు కొనసాగింపుగా మరో 2 సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు నాని విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి.. నెక్ట్స్ సీక్వెల్ లో మరో స్టార్ హీరో విలన్ గా కనిపిస్తాడన్నమాట. సుధీర్ బాబు మాత్రం పోలీస్ గానే కొనసాగుతాడు.

ధూమ్ సిరీస్ ఇలానే నడిచింది. అభిషేక్ బచ్చన్ పాత్ర అలానే ఉంది. విలన్ పాత్రల్లో మాత్రం జాన్ అబ్రహాం, హృతిక్, అమీర్ ఖాన్ వచ్చిచేరారు. సో.. V మూవీని కూడా ఇలా సిరీస్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

First Published:  22 Dec 2019 4:08 AM GMT
Next Story