Telugu Global
National

బాబు బ్యాచ్ కు షాక్.... అమరావతి పై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టేనా?

మొన్న జీవీఎల్ నరసింహారావు.. నిన్న పురంధేశ్వరి.. అమరావతిపై బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు… కేంద్రంలోని పెద్దల అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు. దీంతో అమరావతి విషయంలో కేంద్రం ద్వారా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెప్పించి… అక్కడి భూములను రక్షించుకోవాలని స్కెచ్ గీసిన టీడీపీ పెద్దల మైండ్ బ్లాంక్ అయిపోయినట్టు సమాచారం. ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన తర్వాత మొదట ఉలిక్కిపడింది టీడీపీ నేతలే.. చంద్రబాబు ప్రోద్బలంతో రాజధాని ఎక్కడ వస్తుందో […]

బాబు బ్యాచ్ కు షాక్....  అమరావతి పై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టేనా?
X

మొన్న జీవీఎల్ నరసింహారావు.. నిన్న పురంధేశ్వరి.. అమరావతిపై బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు… కేంద్రంలోని పెద్దల అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు. దీంతో అమరావతి విషయంలో కేంద్రం ద్వారా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెప్పించి… అక్కడి భూములను రక్షించుకోవాలని స్కెచ్ గీసిన టీడీపీ పెద్దల మైండ్ బ్లాంక్ అయిపోయినట్టు సమాచారం.

ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన తర్వాత మొదట ఉలిక్కిపడింది టీడీపీ నేతలే.. చంద్రబాబు ప్రోద్బలంతో రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని అమరావతిలో తక్కువ ధరకి ఇబ్బడి ముబ్బడిగా భూములు కొని భారీగా క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు జగన్ రాజధానిని విశాఖ కేంద్రంగా మార్చడంతో లబోదిబోమంటున్నారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి అయితే ‘అమరావతిని మారిస్తే చూస్తూ ఊరుకోదని’ ఏకంగా హెచ్చరిక జారీ చేశారు. ఇక టీడీపీ నాయకులు కొందరు… ఆ పార్టీ సానుభూతి రైతులతో కలిసి బీజేపీ పెద్దలను కలిసేందుకు బయలు దేరారు.

అయితే మొన్న జీవీఎల్ రాజధాని వికేంద్రీకరణకు బీజేపీ అభ్యంతరం తెలుపదని.. అయినా ఇది రాష్ట్ర అభిమతంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

తాజాగా పురంధేశ్వరిని కలిశారు అమరావతి రైతులు. మీరే కేంద్రంతో మాట్లాడి రాజధానిని మార్చకుండా చేయాలని విన్నవించారు. కానీ పురంధేశ్వరి కూడా హ్యాండ్ ఇచ్చేసింది. బీజేపీ ఎప్పుడూ అధికార వికేంద్రీకరణకు మద్దతు ఇస్తుందని.. మీ భూముల విషయంలో జగన్ సర్కారు న్యాయం చేస్తుందని స్పష్టం చేసింది.

దీంతో టీడీపీ పెద్దల మైండ్ బ్లాంక్ అయిపోయిందట.. బీజేపీ కుండబద్దలు కొట్టడంతో ఇఫ్పుడు ఏం చేయాలో పాలుపోక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారట టీడీపీ నాయకులు.

First Published:  22 Dec 2019 12:05 AM GMT
Next Story