Telugu Global
Cinema & Entertainment

బన్నీ వర్సెస్ మహేష్.... సంక్రాంతికి 250 కోట్ల బెట్టింగ్

ఈ సంక్రాంతి బరిలో భారీ పుంజులున్నాయి. టాలీవుడ్ లోనే అగ్రతారలుగా వెలుగొందుతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్ ల సినిమాలు తీవ్రమైన పోటీతో సై అంటే సై అంటూ తొడగొడుతున్నాయి. ఈ పెద్ద సినిమాల బిజినెస్ ఇప్పటికే యమ జోరుగా సాగుతోంది. మహేష్ బాబు టీజర్ ఆన్ లైన్ లో ఆకట్టుకోగా.. బన్నీ సినిమా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు పెద్ద ఎత్తున జరిగాయి. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు’ […]

బన్నీ వర్సెస్ మహేష్.... సంక్రాంతికి 250 కోట్ల బెట్టింగ్
X

ఈ సంక్రాంతి బరిలో భారీ పుంజులున్నాయి. టాలీవుడ్ లోనే అగ్రతారలుగా వెలుగొందుతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్ ల సినిమాలు తీవ్రమైన పోటీతో సై అంటే సై అంటూ తొడగొడుతున్నాయి. ఈ పెద్ద సినిమాల బిజినెస్ ఇప్పటికే యమ జోరుగా సాగుతోంది.

మహేష్ బాబు టీజర్ ఆన్ లైన్ లో ఆకట్టుకోగా.. బన్నీ సినిమా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు పెద్ద ఎత్తున జరిగాయి.

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీని ఇప్పటికే 110 కోట్లకు అమ్మారని తెలిసింది. ప్రి రిలీజ్ వ్యాపారంలోనే ఇది భారీ అమ్మకం అంటున్నారు.

ఇక బన్నీ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమాను దాదాపు 90 కోట్ల పైనే అమ్మారని తెలిసింది.

అయితే ఈ రెండు సినిమాలే కాదు.. రజినీకాంత్ నటించిన దర్భార్ కూడా జనవరి 9న రిలీజ్ అవుతూ సంక్రాంతి బరిలో నిలిచింది. ఇక సందులో సడేమియాలాగా కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఎంత మంచివాడవురా’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 15న రిలీజ్ అవుతోంది.

ఈ నాలుగు సినిమాలన్నీ కలిపి ఈ సంక్రాంతి బరిలో 250 కోట్ల వ్యాపారాన్ని చేశాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. మరి ఇందులో ఏది హిట్ అవుతుంది.? డబ్బులను తిరిగి తెస్తుందనేది వేచిచూడాలి.

First Published:  20 Dec 2019 8:01 PM GMT
Next Story