Telugu Global
Cinema & Entertainment

ప్రతి రోజూ పండగే మొదటి రోజు వసూళ్లు

సాయి తేజ్, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఇతడు నటించిన ప్రతి రోజూ పండగే సినిమా మొదటి రోజు మెరిసింది. ఏకంగా 3 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అతడి కెరీర్ లో ఇదే అత్యథికం. దీనికి కారణం ఇంతకుముందు అతడు నటించిన చిత్రలహరి సినిమా. ఆ సినిమా హిట్ అవ్వడం, ఈ సినిమాకు మారుతి దర్శకుడు కావడంతో.. ప్రతి రోజూ పండగ సినిమాపై బజ్ పెరిగింది. దానికి తగ్గట్టే వసూళ్లు […]

ప్రతి రోజూ పండగే మొదటి రోజు వసూళ్లు
X

సాయి తేజ్, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఇతడు నటించిన ప్రతి రోజూ పండగే సినిమా మొదటి రోజు మెరిసింది. ఏకంగా 3 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అతడి కెరీర్ లో ఇదే అత్యథికం. దీనికి కారణం ఇంతకుముందు అతడు నటించిన చిత్రలహరి సినిమా. ఆ సినిమా హిట్ అవ్వడం, ఈ సినిమాకు మారుతి దర్శకుడు కావడంతో.. ప్రతి రోజూ పండగ సినిమాపై బజ్ పెరిగింది. దానికి తగ్గట్టే వసూళ్లు వచ్చాయి

ఏపీ, నైజాంలో ఈ సినిమాను 16 కోట్లు (హయర్స్ తో కలుపుకొని) రూపాయలకు అమ్మారు. సినిమాకు మొదటి రోజే హిట్ టాక్ రావడంతో, ఈరోజు రేపు వసూళ్లు మరింత పెరుగుతాయి. మరో వీకెండ్ గడిస్తే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి తేజ్ ఈ సినిమాతో వరుసగా రెండో విజయం అందుకోగా.. డైరక్టర్ మారుతి ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ పైకొచ్చాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 1.25 కోట్లు
సీడెడ్ – రూ. 0.34 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.43 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.22 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
కృష్ణా – రూ. 0.21 కోట్లు

First Published:  21 Dec 2019 9:36 AM GMT
Next Story