Telugu Global
National

అన‌సూయ‌, లావ‌ణ్య త్రిపాఠి ఇళ్ల‌పై జీఎస్టీ దాడులు !

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పై జీఎస్టీ నిఘా వ‌ర్గాలు ఫోక‌స్ పెట్టాయి. జీఎస్టీ క‌ట్ట‌ని ప్ర‌ముఖుల ఇళ్ల‌లో దాడులు నిర్వ‌హించింది. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, యాంక‌ర్ అన‌సూయ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల ఇళ్ల‌లో సోదాలు చేప‌ట్టింది. సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. లావణ్య త్రిపాఠి ఇంటితో […]

అన‌సూయ‌, లావ‌ణ్య త్రిపాఠి ఇళ్ల‌పై జీఎస్టీ దాడులు !
X

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పై జీఎస్టీ నిఘా వ‌ర్గాలు ఫోక‌స్ పెట్టాయి. జీఎస్టీ క‌ట్ట‌ని ప్ర‌ముఖుల ఇళ్ల‌లో దాడులు నిర్వ‌హించింది. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, యాంక‌ర్ అన‌సూయ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల ఇళ్ల‌లో సోదాలు చేప‌ట్టింది.

సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

లావణ్య త్రిపాఠి ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు జరిపారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు వంటి ఆఫీసుల్లో ఉదయం నుంచి డీజీజీఐ బృందాలు సోదాలు నిర్వహించింది. కోట్ల రూపాయ‌ల్లో వీరు స‌ర్వీస్‌, జీఎస్టీ ఎగ‌వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పెద్ద ఎత్తున సోదాలు నిర్వ‌హించారు.

First Published:  20 Dec 2019 8:00 PM GMT
Next Story