Telugu Global
NEWS

జీఎన్‌ రావు కమిటీతో అమరావతికి వచ్చిన నష్టమేంటి?

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అందించింది. శాసనసభను అమరావతిలోనే ఉంచాలని సూచించింది. అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కర్నూలులో, వేసవి సమావేశాలు విశాఖలో నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దాంతో అమరావతిలో అసెంబ్లీ ప్రధాన కార్యాలయం ఉన్నా శీతాకాలం సమావేశాలు కర్నూలులో, వేసవి సమావేశాలు విశాఖలో జరుగుతాయి. హైకోర్టు విషయానికి వస్తే… శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని […]

జీఎన్‌ రావు కమిటీతో అమరావతికి వచ్చిన నష్టమేంటి?
X

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అందించింది. శాసనసభను అమరావతిలోనే ఉంచాలని సూచించింది.

అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కర్నూలులో, వేసవి సమావేశాలు విశాఖలో నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దాంతో అమరావతిలో అసెంబ్లీ ప్రధాన కార్యాలయం ఉన్నా శీతాకాలం సమావేశాలు కర్నూలులో, వేసవి సమావేశాలు విశాఖలో జరుగుతాయి.

హైకోర్టు విషయానికి వస్తే… శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్తా ప్రజల సౌకర్యం కోసం విశాఖలో, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఈ సిఫార్సు వల్ల హైకోర్టు కర్నూలులో పెడితే దూరమవుతుందన్న భావన ఇతర ప్రాంతాలకు రాకుండా కమిటీ జాగ్రత్తపడింది.

సచివాలయ ప్రధాన కార్యాలయం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా కమిటీ సూచన చేసింది. అమరావతిలో శాసన సభ కార్యాలయంతో పాటు రాజ్‌భవన్‌, మంత్రుల క్యార్టర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచన చేసింది.

విశాఖపట్నంలో సచివాలయ ప్రధాన కార్యాలయం, సీఎం క్యాంపు ఆఫీస్‌ ఉంటాయి. అసెంబ్లీ వేసవి సమావేశాలు విశాఖలో జరుగుతాయి. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ… అదే సమయంలో విశాఖలో, అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించింది.

అమరావతి ప్రాంతంలో శాసనసభ, రాజ్‌భవన్‌, హైకోర్టు బెంచ్, మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. అమరావతికి ముంపు ప్రమాదం ఉందన్న వాదనను కమిటీ కూడా పరోక్షంగా సమర్ధించింది. వదర ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయవద్దని సూచించింది. రాయలసీమలో కొద్దిగా డబ్బులు ఖర్చు చేస్తే పూర్తయే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటిపైనా దృష్టి సారించాల్సిందిగా కమిటీ సూచించింది.

సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. శ్రీకాకుళం, విజనగరం, విశాఖలతో ఉత్తర కోస్తా రీజయన్… ఉభయగోదావరి, కృష్ణా జిల్లాతో మధ్య కోస్తా రీజియన్… గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో దక్షిణ కోస్తా రీజియన్‌తో పాటు రాయలసీమ నాలుగు జిల్లాలతో మరో రీజియన్ ఏర్పాటుకు కమిటీ సిఫార్సు చేసింది. రాయలసీమలో భూములు సంవృద్దిగా ఉన్నాయని కాబట్టి పర్యావరణ హితమైన పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయాలని సూచించింది.

మొత్తం మీద చూస్తే అమరావతికి ఏదో అయిపోతోంది అని గగ్గోలు పెట్టాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. ఒక్క సచివాలయం మాత్రం విశాఖకు తరలిపోయే అవకాశం ఉంది. అమరావతిలోనే శాసన సభ, రాజ్‌భవన్, మంత్రుల క్వార్టర్స్ ఉంటాయి. హైకోర్టు బెంచ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. కేవలం ఇతర ప్రాంతాలకు పాలనను తీసుకెళ్తున్నారే గానీ… అమరావతి నుంచి మొత్తం తరలిస్తున్నారని భావించడానికి లేదు.

First Published:  20 Dec 2019 8:05 PM GMT
Next Story