Telugu Global
National

రాజధానుల విషయంలో జగన్ నిర్ణయానికి జైకొట్టిన చిరంజీవి

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున పెద్ద వాళ్లు ఎవరూ మాట్లాడలేదు. పైగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. వీరందరికీ చెక్ పెట్టేలా మెగాస్టార్ చిరంజీవి… వైఎస్ జగన్‌ను ఆకాశానికి ఎత్తేలా పొగిడారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు జగన్ తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు మాజీ మంత్రి, మెగాస్టార్ […]

రాజధానుల విషయంలో జగన్ నిర్ణయానికి జైకొట్టిన చిరంజీవి
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున పెద్ద వాళ్లు ఎవరూ మాట్లాడలేదు. పైగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. వీరందరికీ చెక్ పెట్టేలా మెగాస్టార్ చిరంజీవి… వైఎస్ జగన్‌ను ఆకాశానికి ఎత్తేలా పొగిడారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు.

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు జగన్ తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు.

అమరావతిలో లెజిస్లేటీవ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టాలనే ఆలోచనను అందరూ స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. వీటితో సామాజిక, ఆర్థిక అసమానలు తొలుగుతాయనే ధీమా కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించారని.. అప్పట్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చిరంజీవి అన్నారు. పరిపాలన కేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక సమతుల్యం దెబ్బతిన్నదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ఏపీ రాష్ట్రంపై మూడులక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మరో లక్ష కోట్లు పెట్టి అమరావతినే నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ఎలా జరుగుతుందనే ఆందోళన ప్రజల్లో ఉందని చిరంజీవి అన్నారు.

మూడు రాజధానుల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన అన్నారు. అలాగే రాజధాని ప్రాంత రైతులలో నెలకొన్న భయాందోళన, అభద్రతా భావాన్ని తొలగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ సూచించిన ప్రణాళికను…. జగన్ వ్యూహాత్మకంగా అమలు చేస్తారని చిరంజీవి ఆకాంక్షించారు.

First Published:  21 Dec 2019 5:19 AM GMT
Next Story