Telugu Global
NEWS

ఖాకీ సార్ల‌ ఆస్తుల‌పై ఏసీబీ గురి... ఇద్ద‌రు అధికారుల అరెస్టు !

ఏపీ, తెలంగాణ‌లో ఒక రోజు తేడాలో ఇద్ద‌రు అడిష‌న‌ల్ ఎస్పీలు ఏసీబీ వ‌ల‌లో చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని వీరిపై అభియోగాలు న‌మోద‌య్యాయి. సిద్దిపేట అడిష‌న‌ల్ ఎస్పీ న‌ర‌సింహారెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డంతో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌నను చంచ‌ల్ గూడ జైలుకు త‌రలించారు. మ‌రోవైపు ఏపీలో విశాఖ‌లో కూడా ఇదేసీన్‌. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ హరికృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వ‌హించింది. […]

ఖాకీ సార్ల‌ ఆస్తుల‌పై ఏసీబీ గురి... ఇద్ద‌రు అధికారుల అరెస్టు !
X

ఏపీ, తెలంగాణ‌లో ఒక రోజు తేడాలో ఇద్ద‌రు అడిష‌న‌ల్ ఎస్పీలు ఏసీబీ వ‌ల‌లో చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని వీరిపై అభియోగాలు న‌మోద‌య్యాయి. సిద్దిపేట అడిష‌న‌ల్ ఎస్పీ న‌ర‌సింహారెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డంతో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌నను చంచ‌ల్ గూడ జైలుకు త‌రలించారు.

మ‌రోవైపు ఏపీలో విశాఖ‌లో కూడా ఇదేసీన్‌. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ హరికృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వ‌హించింది. భారీగా అక్రమాస్తులు ఉన్న‌ట్లు గుర్తించింది. హ‌రికృష్ణ‌ను అరెస్టు చేసింది.

ఏసీబీ గుర్తించిన హ‌రికృష్ణ ఆస్తులు !

  • తూర్పుగోదావరి జిల్లా చొల్లంగిలో 300 చదరపు గజాల ఇంటిస్థలం
  • ప‌శ్చిమ‌ గోదావరి మట్టపర్రులో 25 సెంట్ల స్థ‌లం
  • గన్నవరంలో 41.70 చదరపుగజాల స్థలం
  • శ్రీకాకుళం జిల్లా పొన్నాడలో 3.02 ఎకరాల భూమి
  • విజయవాడ హయప్రకాష్ నగర్ లో 54 చదరపు గజాల్లో ఇల్లు
  • విశాఖ జిల్లా పరదేశి పాలెంలో 444 చదరపు గజాల చొప్పున 2 స్థలాలు
  • హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ ఇల్లు
  • 260 గ్రాముల బంగారం, 2.8 కిలోల వెండి, 19 లక్షల విలువచేసే గృహోపకరణాలు
  • 7 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ లు, ఇంట్లో 20 వేల నగదు గుర్తింపు

మొత్తానికి ఆదాయానికి మించి కోటి 71 ల‌క్ష‌ల ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 15 కోట్లకు పైగా వుంటుందని అంచనా.

మ‌రోవైపు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో రెండు రోజుల పాటు సిద్ధిపేట అడిష‌న‌ల్ ఎస్పీ నర్సింహ రెడ్డి ఇల్లు, బందువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సిద్దిపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్ నగర్ ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది.

ఏసీబీ గుర్తించిన ఆస్తులు

  • కిల్లోన్నర బంగారం , 5.3 లక్షల న‌గ‌దు, 6 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్
  • గోల్కొండా లో విల్లా తో పాటు, శంకరప‌ల్లి లో 14 ప్లాట్స్
  • సిద్దిపేట, మహబూబ్ నగర్ లలో 20 ఎకరాల భూమి
  • రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ
  • కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించిన అడిషనల్ ఎస్పీ.

కోర్ట్ లో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు.

First Published:  19 Dec 2019 8:40 PM GMT
Next Story