Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి సంచలనం... ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మానేస్తున్నాడట...

బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లతో కలిసి తీస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దాదాపు 70శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం విశాఖ మన్యంలో ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. అయితే సడన్ గా రాజమౌళి ట్విట్టర్ లో చేసిన ప్రకటనకు అందరూ షాక్ అయ్యారు. ‘తాను ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను మానేస్తున్నాను.. మానేస్తున్నాను’ […]

రాజమౌళి సంచలనం... ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మానేస్తున్నాడట...
X

బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లతో కలిసి తీస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దాదాపు 70శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం విశాఖ మన్యంలో ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది.

అయితే సడన్ గా రాజమౌళి ట్విట్టర్ లో చేసిన ప్రకటనకు అందరూ షాక్ అయ్యారు. ‘తాను ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను మానేస్తున్నాను.. మానేస్తున్నాను’ అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం దుమారం రేపింది. దీనికి గల కారణాలు చెప్పాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాజమౌళి అన్న కీరవాణి ఇద్దరు కొడుకులు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా మరో కొడుకు కాలభైరవ సంగీతం సమకూర్చిన తొలి మూవీ ‘మత్తు వదలరా’ డిసెంబర్ 25న విడుదల అవుతోంది. ఈ సినిమాను చూసేందుకే తాను డిసెంబర్ 25న షూటింగ్ ను మానేస్తున్నానని.. ఆ ఒక్కరోజు విరామం ఇచ్చి ఈ సినిమా చూస్తానని రాజమౌళి ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్, రాంచరణ్ , ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి ‘మత్తు వదలరా ’ మూవీని విశాఖలో చూడబోతున్నారని తెలిసింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఒకరోజు ఆగిపోతుందట.

First Published:  19 Dec 2019 12:46 AM GMT
Next Story