Telugu Global
Cinema & Entertainment

ఫోర్బ్ జాబితాలో... టాలీవుడ్ పరిస్థితి ఇది....

ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ ప్రతీఏటా విడుదల చేసే సంపన్న తారల లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో మొదటిసారిగా కోలీవుడ్ తారలు మన టాలీవుడ్ తారలను సంపాదనలో దాటేయడం విశేషం. రజినీకాంత్, విజయ్, అజిత్ ఈ ఏడాది తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. మన టాలీవుడ్ హీరో ప్రభాస్ టాప్ 100 జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదన కూడా ఈ ఏడాది పడిపోయింది. మహేష్ బాబు… ఫోర్బ్ జాబితాలో 54వ […]

ఫోర్బ్ జాబితాలో... టాలీవుడ్ పరిస్థితి ఇది....
X

ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ ప్రతీఏటా విడుదల చేసే సంపన్న తారల లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో మొదటిసారిగా కోలీవుడ్ తారలు మన టాలీవుడ్ తారలను సంపాదనలో దాటేయడం విశేషం.

రజినీకాంత్, విజయ్, అజిత్ ఈ ఏడాది తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. మన టాలీవుడ్ హీరో ప్రభాస్ టాప్ 100 జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదన కూడా ఈ ఏడాది పడిపోయింది. మహేష్ బాబు… ఫోర్బ్ జాబితాలో 54వ స్థానానికి పడిపోయాడు. గత ఏడాది ఆయన 33వ స్థానంలో ఉండేవారు.

ప్రభాస్, మహేష్ బాబు తప్ప వేరే ఏ తార కూడా ఫోర్బ్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే మన టాలీవుడ్ సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 21.5 కోట్ల రూపాయల ఆదాయంతో 77వ స్థానంలో నిలిచాడు. త్రివిక్రమ్ ప్రతీ సినిమాకు రూ.15కోట్లు వసూలు చేస్తున్నాడు.

గత సంవత్సరం సంపాదనలో ముందున్న రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు ఏడాదిగా సినిమాలు లేకపోవడంతో వారి సంపాదన తగ్గిపోయి స్థానాలకు కోల్పోయారు.

ఇక కోలీవుడ్, మాలీవుడ్ తారలు మాత్రం సంపాదనలో సత్తా చాటారు. రజినీకాంత్, అజిత్, కమల్ హాసన్, ధనుష్, విజయ్, మోహన్ లాల్ , దర్శకుడు శంకర్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజులు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

First Published:  19 Dec 2019 9:37 AM GMT
Next Story