Telugu Global
NEWS

ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ... ఉత్త‌రాంధ్ర‌లో సంబ‌రాలు !

విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార‌బోతుంద‌నే సీఎం జ‌గ‌న్‌ ప్ర‌క‌ట‌న‌ను ఉత్త‌రాంధ్ర‌వాసులు స్వాగ‌తిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఉత్త‌రాంధ్ర‌వాసులు సీఎం ప్ర‌క‌ట‌న‌కు వెల్‌క‌మ్ ప‌లుకుతూ పోస్టులు పెడుతున్నారు. పార్టీల‌క‌తీతంగా ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. త‌మ సోషల్ మీడియా స్టేట‌స్‌ లలో ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెబుతున్నారు. విశాఖ ఇప్ప‌టికే అభివృద్ధి చెందింది. రోడ్ల విస్త‌ర‌ణ చేస్తే చాలు… మెట్రో రైలు తీసుకొస్తే స‌రిపోతుంది అని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రాజ‌ధానిపై నియ‌మించిన క‌మిటీ కూడా….వైజాగ్‌లో ప‌ర్య‌టించింది. ప్ర‌భుత్వ […]

ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ... ఉత్త‌రాంధ్ర‌లో సంబ‌రాలు !
X

విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార‌బోతుంద‌నే సీఎం జ‌గ‌న్‌ ప్ర‌క‌ట‌న‌ను ఉత్త‌రాంధ్ర‌వాసులు స్వాగ‌తిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఉత్త‌రాంధ్ర‌వాసులు సీఎం ప్ర‌క‌ట‌న‌కు వెల్‌క‌మ్ ప‌లుకుతూ పోస్టులు పెడుతున్నారు. పార్టీల‌క‌తీతంగా ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. త‌మ సోషల్ మీడియా స్టేట‌స్‌ లలో ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెబుతున్నారు.

విశాఖ ఇప్ప‌టికే అభివృద్ధి చెందింది. రోడ్ల విస్త‌ర‌ణ చేస్తే చాలు… మెట్రో రైలు తీసుకొస్తే స‌రిపోతుంది అని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రాజ‌ధానిపై నియ‌మించిన క‌మిటీ కూడా….వైజాగ్‌లో ప‌ర్య‌టించింది. ప్ర‌భుత్వ భూములు ఎక్క‌డ ఉన్నాయి? వాటి విస్తీర్ణం ఎంత‌? ఇప్ప‌టికే ఉన్న ప్ర‌భుత్వ శాఖ‌లు ఎన్ని? వాటి కార్యాల‌యాల పరిస్థితి ఏమిటి? కార్యాల‌యాల విస్తీర్ణం మొత్తం వివ‌రాలు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

విశాఖ‌లో ఇప్ప‌టికే ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ఉన్నాయి. ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందింది. క్రికెట్ స్టేడియం ఉంది, దీంతో మౌలిక‌ స‌దుపాయాల‌పై ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో విశాఖ తొంద‌ర‌గానే ప‌రిపాల‌న రాజ‌ధానిగా అభివృద్ధి చెందుతుంద‌ని విశాఖ వాసులు అంటున్నారు.

ఇటు విశాఖ‌నే కాదు… విజ‌యన‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ జిల్లాల ప్ర‌జ‌లు కూడా విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార్చాల‌ని కోరుతున్నారు.

First Published:  18 Dec 2019 12:42 AM GMT
Next Story