Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా ప్రకటన వచ్చేసింది

గ్యాప్ లేకుండా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా అతడు మరో మూవీని అధికారికంగా ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఈరోజు దిల్ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో అనే […]

మరో సినిమా ప్రకటన వచ్చేసింది
X

గ్యాప్ లేకుండా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా అతడు మరో మూవీని అధికారికంగా ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఈరోజు దిల్ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో అనే సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు లైన్లో ఉంటుండగానే, శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం శివ నిర్వాణ… నాని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు టక్ జగదీశ్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. నానితో ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  18 Dec 2019 12:00 AM GMT
Next Story