Telugu Global
NEWS

టీడీపీ వస్తే నా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటా " బాబు సమక్షంలో జేసీ వీరంగం

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి నోరుపారేసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో చంద్రబాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన జేసీ దివాకర్ రెడ్డి… పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలకు ఒంగిఒంగి దండాలు పెడుతుంటున్నారంటూ ఊగిపోయారు. స్టేజ్‌ మీద జేసీ కూడా ఒంగిఒంగి ప్రదర్శన చేస్తూ చూపించారు. జిల్లా ఎస్పీ మాత్రం బాగా పనిచేస్తున్నారని.. కొందరు పోలీసులు మాత్రం ఎమ్మెల్యేలకు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అలాంటి […]

టీడీపీ వస్తే నా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటా  బాబు సమక్షంలో జేసీ వీరంగం
X

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి నోరుపారేసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అనంతపురంలో చంద్రబాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన జేసీ దివాకర్ రెడ్డి… పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలకు ఒంగిఒంగి దండాలు పెడుతుంటున్నారంటూ ఊగిపోయారు. స్టేజ్‌ మీద జేసీ కూడా ఒంగిఒంగి ప్రదర్శన చేస్తూ చూపించారు.

జిల్లా ఎస్పీ మాత్రం బాగా పనిచేస్తున్నారని.. కొందరు పోలీసులు మాత్రం ఎమ్మెల్యేలకు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అలాంటి పోలీసులు శ్రీకాకుళం వెళ్లినా వదిలిపెట్టబోమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ”మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాం” అని జేసీ వ్యాఖ్యానించారు.

బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుని వారి ద్వారానే గంజాయి, చీప్ లిక్కర్‌ను పెట్టించి తప్పుడు కేసులు పెట్టిస్తామని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలకు చంద్రబాబు కూడా వంత పాడారు. పోలీసుల సంగతి తేలుస్తామని… పోలీసులు రిటైర్ అయినా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని జేసీ వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  18 Dec 2019 6:11 AM GMT
Next Story