Telugu Global
National

అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి... ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం....

రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకునే రాజధాని ప్రాంతానికి రైలు, రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సూచనలను చంద్రబాబు బేఖాతరు చేశారని విమర్శించారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు, రాజధానిలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాజధాని ఏర్పాటు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని, రాజధాని రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని […]

అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి... ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం....
X

రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకునే రాజధాని ప్రాంతానికి రైలు, రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు.

గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సూచనలను చంద్రబాబు బేఖాతరు చేశారని విమర్శించారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు, రాజధానిలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు.

రాజధాని ఏర్పాటు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని, రాజధాని రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని చంద్రబాబు చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు. రాజధాని నిర్మాణాలతో ఆర్థిక అభివృద్ధి జరిగదన్నారు. ఇప్పుడు అభివృద్ధిని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వికేంద్రీకరిస్తే బీజేపీ స్వాగతిస్తుందని జీవీఎల్ చెప్పారు.

సెక్రటేరియట్ లోని శాఖలను వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా గతంలో చెప్పిందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కీలకమైన రంగాలకు సంబంధించిన శాఖాకార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ తొలి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తోందని.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని జీవీఎల్ చెప్పారు.

గతంలో హైదరాబాద్‌లో అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం వల్ల ఆంధ్రా ప్రాంతం బాగా నష్టపోయిందని… మరోసారి ఆ పొరపాటు జరగకూడదన్నారు. అభివృద్ది ఎప్పుడైనా వికేంద్రీకరణ విధానంలోనే సాగాలన్నారు.

First Published:  18 Dec 2019 2:37 AM GMT
Next Story