Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా ఆగిపోలేదు.. నిర్మాత క్లారిటీ

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రావాల్సిన ఐకాన్ సినిమా ఆగిపోయినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. దీనిపై నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి దగ్గరగా ఉండే ఈ నిర్మాత, ఐకాన్ సినిమా ఆగిపోలేదని స్పష్టంచేశాడు. “ఐకాన్ సినిమా ఆగిపోయిందని అంతా అంటున్నారు. ఆ సినిమా ఆగే ప్రసక్తే లేదు. వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీ బన్నీకి చాలా నచ్చింది. ఆ కథను తన కోసం అలానే ఉంచాలని, ఆయన […]

ఆ సినిమా ఆగిపోలేదు.. నిర్మాత క్లారిటీ
X

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రావాల్సిన ఐకాన్ సినిమా ఆగిపోయినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. దీనిపై నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి దగ్గరగా ఉండే ఈ నిర్మాత, ఐకాన్ సినిమా ఆగిపోలేదని స్పష్టంచేశాడు.

“ఐకాన్ సినిమా ఆగిపోయిందని అంతా అంటున్నారు. ఆ సినిమా ఆగే ప్రసక్తే లేదు. వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీ బన్నీకి చాలా నచ్చింది. ఆ కథను తన కోసం అలానే ఉంచాలని, ఆయన వేణుశ్రీరామ్ ను రిక్వెస్ట్ చేశారు. ఎప్పటికైనా చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను కూడా అప్పట్లో అఫీషియల్ గా ప్రకటించారు. లేట్ అవుతోంది, చేయడం మాత్రం గ్యారెంటీ.”

కథ బాగా నచ్చినప్పటికీ, చేయడానికి టైమ్ లేకపోవడంతో బన్నీ ఐకాన్ ను వాయిదా వేసినట్టు ప్రకటించాడు బన్నీ వాస్. 2022 వరకు బన్నీ కాల్షీట్లు లేవంటున్నాడు. కాస్త లేట్ అయినా ఐకాన్ వచ్చి తీరుతుందంటున్నాడు.

“బన్నీ చాలా బిజీగా ఉన్నాడు. 2022వరకు ఆయన డేట్స్ ఫుల్ అయిపోయాయి. త్రివిక్రమ్ తో సినిమా అయిన వెంటనే, సుకుమార్ సినిమా ఉంటుంది. ఆ వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. సో.. ఐకాన్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది.”

First Published:  18 Dec 2019 6:00 AM GMT
Next Story