Telugu Global
NEWS

సౌతాఫ్రికా క్రికెట్ కు యువరక్తం

వరుస పరాజయాలతో సఫారీటీమ్ డీలా హషీమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్ లాంటి ప్రపంచ ప్రముఖ క్రికెటర్లు రిటైర్ కావడంతో నిస్తేజంగా మారిన సఫారీ క్రికెట్ కు క్రికెట్ సౌతాఫ్రికా కొత్త రక్తం ఎక్కించడం ద్వారా ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యింది. శ్రీలంక చేతిలో 2-0, భారత్ చేతిలో 3-0 పరాజయాలు పొందిన సౌతాఫ్రికా క్రికెట్ జట్టులో ఏకంగా ఆరుగురు యువక్రికెటర్లకు చోటు కల్పించారు. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మార్క్ బౌచర్ […]

సౌతాఫ్రికా క్రికెట్ కు యువరక్తం
X
  • వరుస పరాజయాలతో సఫారీటీమ్ డీలా

హషీమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్ లాంటి ప్రపంచ ప్రముఖ క్రికెటర్లు రిటైర్ కావడంతో నిస్తేజంగా మారిన సఫారీ క్రికెట్ కు క్రికెట్ సౌతాఫ్రికా కొత్త రక్తం ఎక్కించడం ద్వారా ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యింది.

శ్రీలంక చేతిలో 2-0, భారత్ చేతిలో 3-0 పరాజయాలు పొందిన సౌతాఫ్రికా క్రికెట్ జట్టులో ఏకంగా ఆరుగురు యువక్రికెటర్లకు చోటు కల్పించారు. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మార్క్ బౌచర్ చీఫ్ కోచ్ గా, మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్ క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పులు చేశారు.

డిసెంబర్ 26 నుంచి ప్రిటోరియా వేదికగా ఇంగ్లండ్ తో ప్రారంభం కావాల్సిన నాలుగుమ్యాచ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ కు ఫాబ్ డూప్లెసిస్ నాయకత్వంలో 17 మంది సభ్యుల జట్టును సిద్ధం చేశారు.

జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్లలో పీటర్ మాలన్, రాసీ వాన్ డెర్ డ్యూసెన్, ఫాస్ట్ బౌలర్లు డేన్ పీటర్సన్, బేరన్ హెండ్రిక్స్, ఆల్ రౌండర్ డ్వయన్ ప్రిటోరిస్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రూడీ సెకెండ్ ఉన్నారు.

డి బ్రూయిన్, నోర్జే మాత్రం తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో టెంబా బవుమా, క్వింటన్ డి కాక్, వెర్నోన్ ఫిలాండర్, డీన్ ఎల్గర్, కిర్గిసో రబాడా, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మర్కరమ్, జుబ్యార్ హమ్జా ఉన్నారు.

First Published:  17 Dec 2019 12:08 AM GMT
Next Story