Telugu Global
NEWS

టీడీపీ ఎమ్మెల్యే భవానీపై వేధింపులే... దిశ యాక్ట్ కింద తొలి కేసుగా చేస్తాం...

సోషల్ మీడియాలో మహిళలను వేధించినా, అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినా సహించే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి సుచరిత. సోషల్ మీడియాలో వేధింపులను నిరోధించేందుకు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దిశ యాక్ట్ అమలులోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అడిగినట్టుగా మొదటి కేసు ఆమెపై జరుగుతున్న వేధింపులకు సంబంధించే నమోదు చేస్తామని హోంమంత్రి చెప్పారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సైబర్‌ క్రైంకు సంబంధించి సైబర్‌ […]

టీడీపీ ఎమ్మెల్యే భవానీపై వేధింపులే... దిశ యాక్ట్ కింద తొలి కేసుగా చేస్తాం...
X

సోషల్ మీడియాలో మహిళలను వేధించినా, అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినా సహించే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి సుచరిత. సోషల్ మీడియాలో వేధింపులను నిరోధించేందుకు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దిశ యాక్ట్ అమలులోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అడిగినట్టుగా మొదటి కేసు ఆమెపై జరుగుతున్న వేధింపులకు సంబంధించే నమోదు చేస్తామని హోంమంత్రి చెప్పారు.

సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సైబర్‌ క్రైంకు సంబంధించి సైబర్‌ మిత్రా ట్రైనింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామన్నారు. అందులో సభ్యులుగా ఉండాలనుకునే వారిని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌, టిక్‌టాక్‌ లలో అసభ్యకరమైన పోస్టులు పెడితే వారిని అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో నేరాలు పెరగలేదని… స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత నేరాల నమోదు సంఖ్య పెరిగిందన్నారు. ప్రజలు ధైర్యంగా వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తెస్తున్నారని చెప్పారు.

స్పందన కార్యక్రమంలో మహిళలకు సంబంధించి 7388 కేసులు నమోదు అయ్యాయన్నారు. మహిళల రక్షణ పట్ట చిత్తశుద్ది ఉంది కాబట్టే దిశ యాక్ట్ తెస్తున్నట్టు చెప్పారు.

First Published:  17 Dec 2019 12:07 AM GMT
Next Story