Telugu Global
Andhra Pradesh

ఏపీ శీతాకాల సమావేశాలు.... బాబును సొంతపార్టీ నేతలే వణికిస్తున్నారు!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం మధ్య సవివరమైన చర్చోపచర్చలు జరగటం ఆరోగ్యకరమైన పరిణామమే. అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే ప్రతిపక్ష పార్టీ నాయకునికి సొంత పార్టీ నుంచే సరైన వెన్నుదన్ను లభించకపోవడం.

ఏపీ శీతాకాల సమావేశాలు.... బాబును సొంతపార్టీ నేతలే వణికిస్తున్నారు!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం మధ్య సవివరమైన చర్చోపచర్చలు జరగటం ఆరోగ్యకరమైన పరిణామమే.

అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే ప్రతిపక్ష పార్టీ నాయకునికి సొంత పార్టీ నుంచే సరైన వెన్నుదన్ను లభించకపోవడం. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు అనే తేడా లేకుండా ప్రభుత్వ పక్షం నుండి అనేకమంది మూకుమ్మడిగా విరుచుకు పడుతుంటే… ప్రతిపక్ష టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

తన దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని, టక్కు టమారా లను ఉపయోగించి ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. అయితే తమ పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉన్నా… ఒకరిద్దరు శాసన సభ్యులు మినహా ఎవరూ శాసనసభలోనూ, బయట చంద్రబాబుకు మద్ధతు పలికే వారు కనపడడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అనేది చర్చకు దారితీస్తోంది.

టిడిపి 23 మంది శాసనసభ్యుల్లో వంశీని స్వతంత్ర్య అభ్యర్ధిగా స్పీకర్ గుర్తించారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అయితే అంటీ అంటనట్లు గా వ్యవహరిస్తూ… దాదాపు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు.

పార్టీ వ్యూహకర్తగా పేరుపొందిన పయ్యావుల కేశవ్ అనారోగ్యంతో సభకు రావడం లేదు.

ఇక హీరో బాలకృష్ణ ఒకటి రెండు రోజులు సభకు వచ్చి తర్వాత రావడమే మానేశారు.

రోజూ సమావేశాలకు వచ్చే శాసన సభ్యుల్లో అచ్చెం నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ చర్చల్లో చురుకుగా పాల్గొనడం గానీ… ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తుంటే ఆయనకు అండగా నిలవడం కానీ చేయడం లేదు.

గత బడ్జెట్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గిరి, రామరాజు వంటి వారు ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు. గొట్టిపాటి రవి వంటివారు గత సభలో కాస్త హడావిడి చేశారు. వెలగపూడి రామకృష్ణ బాబు, జోగేశ్వరరావు కూడా యాక్టివ్ గానే పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు.

ఏకైక టిడిపి మహిళా సభ్యురాలు ఆదిరెడ్డి భవాని సభలో గట్టిగా మాట్లాడ లేక పోతున్నారు.

గొట్టిపాటి రవికుమార్ సభా సమావేశం రోజున వచ్చి… మళ్లీ సభ ముఖం కూడా చూడలేదు. తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, సభకు రావాలని ఒత్తిడి చేయవద్దని… పార్టీ పెద్దలకు చెప్పారట.

చాలా కాలంగా టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా సభా సమావేశాలకు వచ్చి టిడిపి వాకౌట్ కార్యక్రమంలో కూడా పాల్గొని టిడిపి వాళ్లనే కాకుండా వైసిపి వాళ్ళని కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ తర్వాత ఆయన సభలో అంతగా కనిపించడం లేదు. గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరతారని ప్రచారం చాలా రోజుల నుండి జరుగుతున్నది. అందుకే అతడు చురుకుగా సమావేశాల్లో పాల్గొనడం లేదనేది ఒక ప్రచారం.

అట్లాగే మిగతా టిడిపి శాసనసభ్యులు కూడా సరిగా నోరు మెదపక పోటానికి కారణం… వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలకు ప్రజల్లో మద్ధతు లభించడం…. జగన్ ప్రభుత్వంలో ఎక్కడా తప్పులు దొరక్కపోవడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే కావడం… ఇంకా దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాతే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటం… ఇప్పుడే వైసీపీని విమర్శిస్తూ… వారి దృష్టిని ఆకర్షించి టార్గెట్ అయ్యే కంటే సైలెంట్ గా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే మరికొందరు ప్రతిపక్ష టిడిపి సభ్యులు వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  15 Dec 2019 11:10 PM GMT
Next Story