Telugu Global
International

సోషల్ మీడియాలో వైరల్.... ఈ బాలిక కష్టాలను తీర్చింది....

అభిరుచి, పట్టుదల ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకోవచ్చని ఈ 11 ఏళ్ల ఫిలిపినో అమ్మాయి మరోసారి నిరూపించింది. ఫిలిప్పీన్స్ కి చెందిన రియా బుల్లోస్ అనే 11 ఏళ్ల ట్రాక్ అథ్లెట్, తన ‘తాత్కాలిక బూట్లు’ధరించి రేసును గెలుచుకోవడంతో ఈ వార్త ఇంటర్నెట్‌ సెన్సేషన్ అయింది. ఇలోయిలో స్కూల్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్‌లో 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల పోటీల్లో బులోస్ మూడు బంగారు పతకాలు సాధించింది. ఈ చిన్నారికి పరుగెత్తడానికి […]

సోషల్ మీడియాలో వైరల్.... ఈ బాలిక కష్టాలను తీర్చింది....
X

అభిరుచి, పట్టుదల ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకోవచ్చని ఈ 11 ఏళ్ల ఫిలిపినో అమ్మాయి మరోసారి నిరూపించింది.

ఫిలిప్పీన్స్ కి చెందిన రియా బుల్లోస్ అనే 11 ఏళ్ల ట్రాక్ అథ్లెట్, తన ‘తాత్కాలిక బూట్లు’ధరించి రేసును గెలుచుకోవడంతో ఈ వార్త ఇంటర్నెట్‌ సెన్సేషన్ అయింది.

ఇలోయిలో స్కూల్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్‌లో 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల పోటీల్లో బులోస్ మూడు బంగారు పతకాలు సాధించింది. ఈ చిన్నారికి పరుగెత్తడానికి బూట్లు కూడా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రాక్టీస్ చేయడం చాలా కష్టమయింది.

పోటీల రోజు ఈ పాప గాయాలకు వేసే బాండేజ్ పట్టీలతో తయారుచేసిన తాత్కాలిక బూట్లను ధరించి పరుగెత్తింది. మూడు బంగారు పతకాలు గెలిచిన తర్వాత ఆమె మిగతా ప్రేక్షకులతో కలిసి కూర్చొని మిగిలిన పోటీలు తిలకిస్తున్నప్పుడు ఎవరో ఆమె కాళ్ల వంక పరిశీలనగా చూసినప్పుడు ఈ తాత్కాలిక బూట్లు ధరించిన సంగతి స్పష్టంగ కనిపించింది.

అప్పటివరకు ఆమె కాళ్లకు ఏం ధరించిందనేది ఎవరూ గమనించలేదు. గమనించిన తర్వాత సోషల్ మీడియా లో ఈ విషయాన్ని ఉంచడం తో వైరల్ అయింది.

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బులోస్ శిక్షకుడు తన శిష్యురాలిని చూసి గర్విస్తున్నట్లు చెప్పాడు. “ఆమె గెలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆమె శిక్షణ పొందుతున్నప్పుడు చాలా కష్టపడింది. ఆమే కాదు శిక్షణ పొందుతున్నప్పుడు చాలామంది పిల్లలు అలసిపోతారు ఎందుకంటే వారికి బూట్లు లేవు.” ఈ బాలిక సంగతి తెలిసి ఆన్‌లైన్‌లో చాలా మంది బాలికకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు.

ఫిలిప్పీన్స్‌లోని టాబ్లాయిడ్ వార్తాపత్రిక ది డైలీ గార్డియన్ వెంటనే, స్థానిక మాల్‌లోని షూ దుకాణంలో బులోస్ కి బ్రాండెడ్ బూట్లు కొనిపెట్టింది. ఆ ఫోటోలను ట్వీట్ చేసింది.

సోషల్ మీడియా పుణ్యమా అని రియా బుల్లోస్ తన అథ్లెటిక్ కెరీర్‌కు అవసరమైన మద్దతు, ప్రోత్సాహాన్ని పొందింది.

First Published:  16 Dec 2019 7:35 AM GMT
Next Story