Telugu Global
Cinema & Entertainment

సానియా మీర్జాతో రామ్ చరణ్ చిందులు

వెండితెరపై రామ్ చరణ్ స్టెప్స్ గురించి కొత్తగా చెప్పదేం లేదు. డాన్స్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చిరంజీవికి సిసలైన వారసుడు కూడా. అదే రామ్ చరణ్ రియల్ లైఫ్ లో స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది. పైగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి స్టెప్పులేశాడు. ఆ అరుదైన వీడియోను రామ్ చరణ్ భార్య ఉపాసన షేర్ చేసింది. ఈమధ్యే సానియా మీర్జా చెల్లెలు పెళ్లి జరిగింది. ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ […]

సానియా మీర్జాతో రామ్ చరణ్ చిందులు
X

వెండితెరపై రామ్ చరణ్ స్టెప్స్ గురించి కొత్తగా చెప్పదేం లేదు. డాన్స్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చిరంజీవికి సిసలైన వారసుడు కూడా. అదే రామ్ చరణ్ రియల్ లైఫ్ లో స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది. పైగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి స్టెప్పులేశాడు. ఆ అరుదైన వీడియోను రామ్ చరణ్ భార్య ఉపాసన షేర్ చేసింది.

ఈమధ్యే సానియా మీర్జా చెల్లెలు పెళ్లి జరిగింది. ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ వివాహానికి చరణ్ తన భార్యతో పాటు హాజరయ్యాడు. ఆ సందర్భంగా ఓ బాలీవుడ్ సాంగ్ కు సానియాతో కలిసి చిందులేశాడు. అక్కడే ఉన్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. వీళ్లకు అక్కడికక్కడే కొన్ని డాన్స్ మూమెంట్స్ నేర్పారు.

అలా సానియా-చరణ్ కలిసి తమ స్టెప్పులతో అందర్నీ అలరించారు. ఈ వీడియోలో చరణ్, సానియాతో కలిసి చిందేయడం ఓ ఎత్తయితే.. ఆ వీడియోను స్వయంగా ఉపాసన షేర్ చేయడం కొసమెరుపు.

First Published:  15 Dec 2019 1:28 AM GMT
Next Story