Telugu Global
International

ఈ తల్లి ఆలోచన.... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....

స్త్రీ పురుషులు ఇరువురూ బయటికి పోయి ఉద్యోగం చేసుకుంటేకాని ఈ రోజుల్లో కుటుంబాన్ని సౌకర్యవంతంగా నడిపించడం సాధ్యం కాదు. అయితే పురుషులతో పోల్చి చూసినప్పుడు స్త్రీలు ఉద్యోగం చేయడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. అందులో ముఖ్యమయింది పిల్లల బాధ్యత. కానుపు తర్వాత కొద్ది రోజులకే తల్లి పిల్లలను వదలి ఉద్యోగంలో తిరిగి చేరాలి. తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు. కనుక తల్లి కనపడకపోతే పసివాళ్లు అల్లాడుతారు. వారిని ఊరుకోబెట్టడం చాలా […]

ఈ తల్లి ఆలోచన.... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....
X

స్త్రీ పురుషులు ఇరువురూ బయటికి పోయి ఉద్యోగం చేసుకుంటేకాని ఈ రోజుల్లో కుటుంబాన్ని సౌకర్యవంతంగా నడిపించడం సాధ్యం కాదు.

అయితే పురుషులతో పోల్చి చూసినప్పుడు స్త్రీలు ఉద్యోగం చేయడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. అందులో ముఖ్యమయింది పిల్లల బాధ్యత. కానుపు తర్వాత కొద్ది రోజులకే తల్లి పిల్లలను వదలి ఉద్యోగంలో తిరిగి చేరాలి. తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు. కనుక తల్లి కనపడకపోతే పసివాళ్లు అల్లాడుతారు. వారిని ఊరుకోబెట్టడం చాలా కష్టం.

అయితే జపాన్ కి చెందిన ఓ తల్లి…. ఇటువంటి చిన్న పిల్లలు ఇంట్లో తల్లి లేదనే సంగతి గుర్తించకుండా ఒక ఆలోచన చేసింది. ‘సతో నెజి’ అనే జపాన్ వ్యక్తి ఆమె ట్రిక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్ లో ఉంచడంతో వైరల్ అయ్యాయి.

అసలేం జరిగిందంటే… ఏడాది పిల్లవాడు వాళ్లమ్మ కనపడకపోతే చాలు ఆమె కోసం ఏడుస్తున్నాడు. దీంతో ఆమెకు ఒక ఉపాయం తట్టింది. తన ఎత్తు ఉన్న కటౌట్ లను పిల్లవానికి కనిపించేట్లు ఉంచింది. వాటిని పిల్లవాడికి అందకుండా ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడింది.

ఆ కటౌట్ లను చూసి తన తల్లి ఇంట్లోనే ఉందని భ్రమపడుతూ ఆ బుడతడు ఆడుకుంటున్నాడు. ఇదే సంగతి వీడియో లోనూ కనిపిస్తున్నది. మొత్తానికి తల్లిని వదిలి ఉండలేని పిల్లలకు ఈ ట్రిక్ మంచి పరిష్కారమని నెటిజన్లు ముక్తకంఠంతో అంటున్నారు.

First Published:  14 Dec 2019 3:40 AM GMT
Next Story