Telugu Global
NEWS

25 లక్షలు ఇప్పిస్తామని సాంబిరెడ్డి ఫ్యామిలీతో బేరసారం...

కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో సాంబిరెడ్డి అనే వ్యక్తి చనిపోవడం రాజకీయ రంగు పులుముకుంది. సాంబిరెడ్డి ఉల్లి గడ్డల కోసం వెళ్లి క్యూలైన్‌లో నిల్చోలేక చనిపోయాడని… దీనికి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంతూరులోనే ఈ ఘటన జరగడం చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సాంబిరెడ్డి అంశంపై నాలుగైదు ట్వీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు. మీడియా కూడా సాంబిరెడ్డి […]

25 లక్షలు ఇప్పిస్తామని సాంబిరెడ్డి ఫ్యామిలీతో బేరసారం...
X

కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో సాంబిరెడ్డి అనే వ్యక్తి చనిపోవడం రాజకీయ రంగు పులుముకుంది. సాంబిరెడ్డి ఉల్లి గడ్డల కోసం వెళ్లి క్యూలైన్‌లో నిల్చోలేక చనిపోయాడని… దీనికి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంతూరులోనే ఈ ఘటన జరగడం చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సాంబిరెడ్డి అంశంపై నాలుగైదు ట్వీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు. మీడియా కూడా సాంబిరెడ్డి మృతిని ప్రముఖంగా ప్రచురించింది.

సాంబిరెడ్డి కుమారుడు మల్లికార్జున్‌ రెడ్డి

ఈ వార్తలపై సాంబిరెడ్డి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. సాంబిరెడ్డి కుమారుడు మల్లికార్జున్‌ రెడ్డి, సాంబిరెడ్డి బామ్మర్ది నారాయణరెడ్డిలు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తమ తండ్రి ఉల్లిపాయల కోసం క్యూలైన్‌లో నిలబడలేదని… గుడికి వెళ్లివస్తూ గుండెపోటుకు గురై పడిపోయాడని… దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం సరికాదని కుమారుడు మల్లికార్జున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సాంబిరెడ్డి బామ్మర్ది నారాయణరెడ్డి మరింత తీవ్రంగా స్పందించారు. సాంబిరెడ్డి గతంలో ఆర్టీసీలో పనిచేసేవారని… 15 ఏళ్ల క్రితమే గుండెపోటు రాగా వీఆర్‌ఎస్ తీసుకున్నారని నారాయణరెడ్డి వివరించారు. రోజూ గుడికి వెళ్లే సాంబిరెడ్డి వస్తూ వస్తూ రైతు బజార్‌లో తాజా కూరగాయాలు తెస్తుంటారని వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే సాంబిరెడ్డిని తమ వద్దే ఉంచుకున్నామని నారాయణరెడ్డి వెల్లడించారు. సాంబిరెడ్డికి 15 ఎకరాల భూమి ఉందని… ఇద్దరు పిల్లలు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అని… కిలో ఉల్లిపాయల కోసం క్కూలైన్‌లో నిలబడే వ్యక్తి కానేకాదని వివరించారు.

సాంబిరెడ్డి బామ్మర్ది నారాయణరెడ్డి

కొన్ని టీవీల్లో ఉల్లి కోసం వెళ్లే సాంబిరెడ్డి చనిపోయారని ప్రచారం చేస్తుండడంతో తాను వివరణ కూడా ఇచ్చానని… తొలుత మారుస్తామని చెప్పిన తర్వాత కూడా అదే ప్రచారం చేశారని నారాయణరెడ్డి మండిపడ్డారు. మరోసారి ఇదే ప్రచారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని నారాయణరెడ్డి హెచ్చరించారు.

First Published:  10 Dec 2019 6:14 AM GMT
Next Story