Telugu Global
Cinema & Entertainment

మరోసారి బుక్కయిన దేవిశ్రీప్రసాద్

ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి విడుదల చేసిన మొదటి పాట చెత్తగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను మరిపించడం కోసం తక్కువ వ్యవధిలోనే సినిమాకు సంబంధించి మరో పాట రిలీజ్ చేశారు. దీంతో మొదటి పాట ప్రభావం కొంత తగ్గుతుందని మేకర్స్ భావించారు. కానీ రెండో పాట కూడా అదే తీరున ఉండడంతో దేవిశ్రీపై ట్రోలింగ్ ఇప్పుడు మరింత ఎక్కువైంది. సూర్యడివో […]

మరోసారి బుక్కయిన దేవిశ్రీప్రసాద్
X

ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి విడుదల చేసిన మొదటి పాట చెత్తగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను మరిపించడం కోసం తక్కువ వ్యవధిలోనే సినిమాకు సంబంధించి మరో పాట రిలీజ్ చేశారు. దీంతో మొదటి పాట ప్రభావం కొంత తగ్గుతుందని మేకర్స్ భావించారు. కానీ రెండో పాట కూడా అదే తీరున ఉండడంతో దేవిశ్రీపై ట్రోలింగ్ ఇప్పుడు మరింత ఎక్కువైంది.

సూర్యడివో చంద్రుడివో అంటూ సాగే లిరికల్ సాంగ్ ను నిన్న రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఇంతకుముందు మంచి మెలొడీలు ఇచ్చాడు కాబట్టి, ఈ మెలొడీ బాగుంటుందని అంతా భావించారు. కానీ డీఎస్పీ మాత్రం తన పాత ట్యూన్స్ నే అటుఇటు తిప్పి మళ్లీ కొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో దేవిశ్రీపై సెటైర్లు షురూ అయ్యాయి.

తాజాగా రిలీజైన పాట ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఇప్పుడు డైలమాలో పడింది. ఇలా దశలవారీగా పాటలు విడుదల చేసి క్రేజ్ తగ్గించుకోవడం కంటే, మరో విధంగా సినిమాకు ప్రచారం కల్పించడం ఉత్తమమని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే జూక్ బాక్స్ మొత్తం విడుదల చేసి, కేరళలో ఆమధ్య షూట్ చేసిన ప్రమోషనల్ వీడియోస్ ను తొందరగా బయటకు తీసుకురావాలని అనుకుంటున్నారు. నిజంగా ఇది దేవిశ్రీప్రసాద్ కు అవమానమే.

First Published:  9 Dec 2019 11:56 PM GMT
Next Story