Telugu Global
International

నెహ్రూపై సాధ్వీ అనుచిత వ్యాఖ్యలు

దేశ తొలి ప్రధాని నెహ్రుపై వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద రేపిస్ట్ నెహ్రునే అని విమర్శించారు. మోడీ హయాంలో భారతదేశం అత్యాచారాల రాజధానిగా మారింది అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తొలిరోజుల్లో ఈ దేశం మంచిగా ఉండేదని…. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే దేశంలోకి అత్యాచారాల సంస్కృతి వచ్చిందన్నారు. అత్యాచారాల సంస్కృతికి నెహ్రునే కారణమని వ్యాఖ్యానించారు. నెహ్రు అతిపెద్ద రేపిస్ట్‌ అని […]

నెహ్రూపై సాధ్వీ అనుచిత వ్యాఖ్యలు
X

దేశ తొలి ప్రధాని నెహ్రుపై వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద రేపిస్ట్ నెహ్రునే అని విమర్శించారు.

మోడీ హయాంలో భారతదేశం అత్యాచారాల రాజధానిగా మారింది అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలిరోజుల్లో ఈ దేశం మంచిగా ఉండేదని…. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే దేశంలోకి అత్యాచారాల సంస్కృతి వచ్చిందన్నారు.

అత్యాచారాల సంస్కృతికి నెహ్రునే కారణమని వ్యాఖ్యానించారు. నెహ్రు అతిపెద్ద రేపిస్ట్‌ అని … ఈ దేశంలోకి నక్సలిజం, టెర్రరిజం, రేపిజం అన్ని కూడా నెహ్రు కుటుంబం నుంచి వచ్చినవేనని విమర్శించారు.

దిశ ఘటన, ఉన్నావ్ ఉదంతం నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న అత్యాచారాలను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు.

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా…. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

First Published:  9 Dec 2019 12:08 AM GMT
Next Story