Telugu Global
NEWS

హ్యాట్రిక్ ల్లో మెస్సీ సరికొత్త రికార్డు

రొనాల్డో రికార్డును అధిగమించిన మెస్సీ యూరోపియన్ సాకర్ లా లీగాలో బార్సిలోనా కమ్ అర్జెంటీనా స్ట్ర్రయికర్ లయనల్ మెస్సీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ పోర్చుగల్ స్ట్ర్రయికర్ క్రిస్టియనో రొనాల్డోతో కలసి పంచుకొన్న రికార్డును అధిగమించాడు. 2019 లా లీగాలో భాగంగా మలో్ర్కా క్లబ్ తో ముగిసిన మ్యాచ్ లో మెస్సీ మ్యాజిక్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు. తన జట్టుకు 5-2 గోల్స్ విజయం అందించాడు. మెస్సీ ఆట 17, 41, 83 నిముషాలలో గోల్స్ […]

హ్యాట్రిక్ ల్లో మెస్సీ సరికొత్త రికార్డు
X
  • రొనాల్డో రికార్డును అధిగమించిన మెస్సీ

యూరోపియన్ సాకర్ లా లీగాలో బార్సిలోనా కమ్ అర్జెంటీనా స్ట్ర్రయికర్ లయనల్ మెస్సీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ పోర్చుగల్ స్ట్ర్రయికర్ క్రిస్టియనో రొనాల్డోతో కలసి పంచుకొన్న రికార్డును అధిగమించాడు.

2019 లా లీగాలో భాగంగా మలో్ర్కా క్లబ్ తో ముగిసిన మ్యాచ్ లో మెస్సీ మ్యాజిక్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు. తన జట్టుకు 5-2 గోల్స్ విజయం అందించాడు.

మెస్సీ ఆట 17, 41, 83 నిముషాలలో గోల్స్ సాధించడం ద్వారా…తన కెరియర్ లో 35వ లా లీగా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. క్రిస్టియానో రొనాల్డోకు 34సార్లు హ్యాట్రిక్ లు సాధించిన రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును మెస్సీ తెరమరుగు చేశాడు.

గత 14సీజన్లుగా యూరోపియన్ సాకర్ లీగ్ లో పదికి పైగా గోల్స్ సాధిస్తూ వస్తున్న ఏకైక ఆటగాడు మెస్సీ మాత్రమే కావడం విశేషం,

First Published:  9 Dec 2019 12:23 AM GMT
Next Story