Telugu Global
NEWS

శాఫ్ గేమ్స్ మహిళా టీ-20లో మరో చెత్తరికార్డు

9 మంది ప్లేయర్లు డకౌట్, 8 పరుగులకే మాల్దీవ్స్ ఆలౌట్ అప్పుడు మాలీ…ఇప్పుడు మాల్దీవ్స్ శాఫ్ గేమ్స్ మహిళా టీ-20 క్రికెట్లో మాల్తీవ్స్ మరో చెత్తరికార్డు మూటగట్టుకొంది. ఫోక్రా వేదికగా నేపాల్ తో ముగిసిన గ్రూప్ లీగ్ పోటీలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న మాల్దీవ్స్ జట్టు 20 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే కుప్పకూలింది. 11.3 ఓవర్లలోనే నేపాల్ జట్టు ప్రత్యర్తిని ఆలౌట్ చేయగలిగింది. మాల్దీవ్స్ సాధించిన మొత్తం 8 పరుగుల […]

శాఫ్ గేమ్స్ మహిళా టీ-20లో మరో చెత్తరికార్డు
X
  • 9 మంది ప్లేయర్లు డకౌట్, 8 పరుగులకే మాల్దీవ్స్ ఆలౌట్
  • అప్పుడు మాలీ…ఇప్పుడు మాల్దీవ్స్

శాఫ్ గేమ్స్ మహిళా టీ-20 క్రికెట్లో మాల్తీవ్స్ మరో చెత్తరికార్డు మూటగట్టుకొంది. ఫోక్రా వేదికగా నేపాల్ తో ముగిసిన గ్రూప్ లీగ్ పోటీలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న మాల్దీవ్స్ జట్టు 20 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే కుప్పకూలింది. 11.3 ఓవర్లలోనే నేపాల్ జట్టు ప్రత్యర్తిని ఆలౌట్ చేయగలిగింది.

మాల్దీవ్స్ సాధించిన మొత్తం 8 పరుగుల స్కోరులో 7 పరుగులు వైడ్ల రూపంలోనే లభించడం విశేషం.

మాల్దీవ్స్ కెప్టెన్ జూనా మరియం 16 బాల్స్ ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగింది. నేపాల్ బౌలర్లలో అంజలీ చంద్ 4 ఓవర్లలో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.

సమాధానంగా 9 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆతిథ్య నేపాల్ కేవలం 7 బాల్స్ లోనే వికెట్ నష్టపోకుండా విజేతగా నిలిచింది. నేపాల్ ఓపెనర్లు కాజల్ శ్రేష్ట, రోమా థాపా అజేయంగా నిలిచారు.

మహిళా టీ-20 చరిత్రలో అతితక్కువ స్కోరు రికార్డు మాలి పేరుతో ఉంది. రువాండా గత జూన్ లో జరిగిన పోటీలో మాలీ కేవలం 6 పరుగులకే ఆలౌట్ కావడం… అత్యంత చెత్తరికార్డుగా ఉంది.

First Published:  7 Dec 2019 11:16 PM GMT
Next Story