Telugu Global
NEWS

దిశ ప్రభావం... త్వరలో సినీ రచయితలు, నిర్మాతలకు టీ పోలీసుల కౌన్సిలింగ్

రానురాను సినీ రంగం సమాజానికి మంచి చేయడం అటుంచి… హానీ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. సినిమా హిట్ అయితే చాలూ…. సమాజంతో తమకేం పని అన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా హీరోలు డబుల్ మీనింగ్ పాటలకు స్టెప్పులేయడం, బూతు డైలాగులు చెప్పడం ఫ్యాషనైపోయింది. ”పడుకున్నదాన్ని రేప్ చేస్తే కిక్కేముంటుంది… పరిగెత్తే దాన్ని రేప్‌ చేయాలి గానీ” అంటూ… పవన్ కల్యాణ్ లాంటి వారు తమ సినిమాల్లో డైలాగులు చెబుతున్నారు. ఇక ఇటీవల వస్తున్న […]

దిశ ప్రభావం... త్వరలో సినీ రచయితలు, నిర్మాతలకు టీ పోలీసుల కౌన్సిలింగ్
X

రానురాను సినీ రంగం సమాజానికి మంచి చేయడం అటుంచి… హానీ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. సినిమా హిట్ అయితే చాలూ…. సమాజంతో తమకేం పని అన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు.

వయసుతో సంబంధం లేకుండా హీరోలు డబుల్ మీనింగ్ పాటలకు స్టెప్పులేయడం, బూతు డైలాగులు చెప్పడం ఫ్యాషనైపోయింది.

”పడుకున్నదాన్ని రేప్ చేస్తే కిక్కేముంటుంది… పరిగెత్తే దాన్ని రేప్‌ చేయాలి గానీ” అంటూ… పవన్ కల్యాణ్ లాంటి వారు తమ సినిమాల్లో డైలాగులు చెబుతున్నారు. ఇక ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు పోర్న్ చిత్రాలతో పోటీకి సై అన్నట్టుగా ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సినిమావాళ్ల మైండ్ సెట్‌ను మార్చాలని భావిస్తున్నారు. త్వరలోనే సినీ రచయితలు, నిర్మాతలతో తెలంగాణ పోలీసులు సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. సినిమాలు టీనేజ్ పిల్లలపై బాగా ప్రభావం చూపుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

యవ్వన ఆరంభ దశలో పిల్లలు చాలా అయోమయంలో ఉంటారని… ఇలాంటి సమయంలో వారిపై సినిమాలు చెడుప్రభావం చూపుతున్నాయని స్వాతి లక్రా వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీయడం అనైతికమన్నారు. సినిమాల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా మెదళ్లలోకి ఎక్కుతోందని… ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాల ప్రభావంతో టీనేజ్ పిల్లలు తప్పుదోవ పట్టడం వల్ల జరిగే నేరాల్లో అమాయక ఆడపిల్లలు బలైపోతున్నారని ఆవేదన చెందారు.

సినిమాల్లో హింస, అశ్లీలత, ఇతర అభ్యంతరకర సన్నివేశాలు, బూతు డైలాగులు, కథలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని… ఇందుకోసం త్వరలోనే నిర్మాతలు, రచయితలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. చెడు సినిమాల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని వారికి వివరిస్తామన్నారు.

First Published:  8 Dec 2019 12:53 AM GMT
Next Story