Telugu Global
National

మోడీపై ఒత్తిడి పెంచిన కేసీఆర్

సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను మించి రాజకీయ చతురత.. వ్యూహ చతురత మరొకరికి లేదని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. రాల్లేసిన వారితోనే పూలు కురిపించుకునే ఘనత కేసీఆర్ సొంతమని చెప్పవచ్చు.. తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలోనూ.. దిశ ఎన్ కౌంటర్ విషయంలోనూ కేసీఆర్ వ్యూహాలు… మామూలు జనాలనే కాక, రాజకీయ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచాయి. కేసీఆర్ ను తీవ్రంగా తిట్టిన ఆర్టీసీ కార్మికులతోనే కేసీఆర్ చప్పట్లు కొట్టించుకున్నారు. జై కేసీఆర్ అని […]

మోడీపై ఒత్తిడి పెంచిన కేసీఆర్
X

సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను మించి రాజకీయ చతురత.. వ్యూహ చతురత మరొకరికి లేదని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. రాల్లేసిన వారితోనే పూలు కురిపించుకునే ఘనత కేసీఆర్ సొంతమని చెప్పవచ్చు..

తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలోనూ.. దిశ ఎన్ కౌంటర్ విషయంలోనూ కేసీఆర్ వ్యూహాలు… మామూలు జనాలనే కాక, రాజకీయ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచాయి. కేసీఆర్ ను తీవ్రంగా తిట్టిన ఆర్టీసీ కార్మికులతోనే కేసీఆర్ చప్పట్లు కొట్టించుకున్నారు. జై కేసీఆర్ అని నినదించేలా చేశారు.

ఇక దిశ హత్యోదంతంలో తెలంగాణ సర్కారును, కేసీఆర్, తెలంగాణ పోలీసులను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు, సంఘాలు, ఇతర జాతీయ మీడియా కూడా తూర్పారబట్టాయి. ఇప్పుడు దిశ హంతకుల ఎన్ కౌంటర్ తో తిట్టిన వారితోనే కేసీఆర్ శభాష్ అనిపించుకుంటున్నారు.

కాగా ఇప్పుడు ఒక్క ఎన్ కౌంటర్ తో కేసీఆర్ ఓవర్ నైట్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు దేశంలో ముఖ్యంగా యూపీలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇదే శరాఘాతంగా మారింది. బీజేపీ హయాంలోనే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దమనకాండలు పెట్రేగిపోతున్నాయి.

ముఖ్యంగా ఇటీవలే యూపీలోని ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలిని కాల్చిచంపేశారు. ఆమె మరణ కారకులను ఇలాగే ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. కేసీఆర్ చేసిన పనితో ఇప్పుడు మోడీ ఇరుకునపడుతున్నారు.

First Published:  7 Dec 2019 1:38 AM GMT
Next Story