Telugu Global
CRIME

సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం కాదు... అందుకే అక్కడికి తీసుకెళ్లాం " సీపీ

పోలీసుల పై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించడం వల్లే తాము నలుగురిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ వివరించారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలోనే మీడియాతో మాట్లాడిన సజ్జనార్‌… ఏ1 నిందితుడు తొలుత పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. నిందితుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారన్నారు. నిందితులను తాను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లలేదని… దిశకు సంబంధించిన సెల్‌ఫోన్, వాచీ, పవర్‌ […]

సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం కాదు... అందుకే అక్కడికి తీసుకెళ్లాం  సీపీ
X

పోలీసుల పై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించడం వల్లే తాము నలుగురిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ వివరించారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలోనే మీడియాతో మాట్లాడిన సజ్జనార్‌… ఏ1 నిందితుడు తొలుత పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. నిందితుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.

రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారన్నారు. నిందితులను తాను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లలేదని… దిశకు సంబంధించిన సెల్‌ఫోన్, వాచీ, పవర్‌ బ్యాంకును దాచిన చోటు చూపెడుతామంటే తీసుకెళ్లామని చెప్పారు.

అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులపై రాళ్లు, కర్రలతో నిందితులు దాడికి ప్రయత్నించారని చెప్పారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కునేందుకు యత్నించారని వివరించారు. పలుమార్లు పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో నిందితులపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 5.45 నుంచి 6. 15 మధ్యలో జరిగిందన్నారు. రాళ్ల దాడిలో గాయపడ్డ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌ను ఆస్పత్రికి తరలించామన్నారు.

ఈ నిందితులు తెలంగాణతో పాటు కర్నాటక, ఏపీలోనూ ఈ తరహా ఘటనలకు పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయని… వాటిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

First Published:  6 Dec 2019 7:10 AM GMT
Next Story