Telugu Global
CRIME

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై యువతుల ఫిర్యాదు

పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశీష్‌గౌడ్‌పై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ వద్ద ఆశీష్‌గౌడ్ తమను వేధించాడంటూ మాదాపూర్‌ పీఎస్‌లో యువతులు ఫిర్యాదు ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో తాము హోటల్ వద్ద నిలబడి ఉండగా ఆశీష్‌ గౌడ్, అతడి మిత్రులు అసభ్యకరంగా ప్రవర్తించారని యువతులు వివరించారు. మద్యం సేవించి వచ్చి తమ చేతులు పట్టుకుని రావాలంటూ వేధించారని ఫిర్యాదు చేశారు. అక్కడున్న హోటల్ బౌన్సర్లు కూడా […]

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై యువతుల ఫిర్యాదు
X

పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశీష్‌గౌడ్‌పై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ వద్ద ఆశీష్‌గౌడ్ తమను వేధించాడంటూ మాదాపూర్‌ పీఎస్‌లో యువతులు ఫిర్యాదు ఇచ్చారు.

రాత్రి 2 గంటల సమయంలో తాము హోటల్ వద్ద నిలబడి ఉండగా ఆశీష్‌ గౌడ్, అతడి మిత్రులు అసభ్యకరంగా ప్రవర్తించారని యువతులు వివరించారు. మద్యం సేవించి వచ్చి తమ చేతులు పట్టుకుని రావాలంటూ వేధించారని ఫిర్యాదు చేశారు.

అక్కడున్న హోటల్ బౌన్సర్లు కూడా ఆశీష్‌ గౌడ్‌కే వంతపాడేలా వ్యవహరించారని వివరించారు. ఫిర్యాదు చేసిన వారిలో బిగ్‌బాస్-2 కంటెస్టెంట్ సంజన ఉన్నారు. యువతుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story