Telugu Global
NEWS

మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు " లోకేష్‌ ... అంతా ఫెయిడ్‌ ఆర్టిస్టులేగా... టిఫిన్‌ పెట్టారా?-బాబు

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందంపై సోషల్ మీడియాలో రెండు వీడియోల ఆధారంగా నెటిజన్లు పెద్దెత్తున ట్రోల్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి రెండు వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయి. అందులో ఒకటి లోకేష్‌ది కాగా… మరొకటి చంద్రబాబుది. చంద్రబాబు పర్యటనలో చిత్తశుద్ది ఏపాటిదో ఈ రెండు వీడియోలను బట్టే అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బస్సు రన్నింగ్‌లో […]

మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు  లోకేష్‌ ... అంతా ఫెయిడ్‌ ఆర్టిస్టులేగా... టిఫిన్‌ పెట్టారా?-బాబు
X

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందంపై సోషల్ మీడియాలో రెండు వీడియోల ఆధారంగా నెటిజన్లు పెద్దెత్తున ట్రోల్ చేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి రెండు వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయి.

అందులో ఒకటి లోకేష్‌ది కాగా… మరొకటి చంద్రబాబుది. చంద్రబాబు పర్యటనలో చిత్తశుద్ది ఏపాటిదో ఈ రెండు వీడియోలను బట్టే అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

బస్సు రన్నింగ్‌లో ఉండగానే నారా లోకేష్ బస్సు మధ్యలో నిలబడి పార్టీ నేతలతో జోకులేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల అందాన్ని నారా లోకేష్‌ పొగుడుతున్నట్టు వీడియో బయటకొచ్చింది. ఒక టీడీపీ నేతను ఉద్దేశించి నారా లోకేష్… ”చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు మీరు…. హెయిర్‌ స్టైల్‌ బాగుంది మీది” అంటూ కితాబిచ్చారు.

మరో వీడియోలో తన పర్యటనకు వచ్చిన వారి యోగక్షేమాల గురించి చంద్రబాబు ఆరా తీయడం ఉంది. ” కార్యకర్తలకు టిఫిన్లు పెట్టారా?” అని చంద్రబాబు తనకు ఎదురుగా ఉన్న ఒక టీడీపీ నేతను ప్రశ్నించారు. అందుకు సదరు టీడీపీ నేత ”లేదు.. అంతా డబ్బులే.. డబ్బు ఇవ్వకుంటే ఎవరొస్తారు?” అని సమాధానం ఇచ్చారు.

ఇందుకు తిరిగి స్పందించిన చంద్రబాబు ”అంతా పెయిడ్ ఆర్టిస్టులేగా” అంటూ టీడీపీ నేతతో వ్యాఖ్యానించారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

ప్రభుత్వంపై బురదజల్లేందుకు పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు తయారు చేయించి విడుదల చేసిన టీడీపీ…. ఇప్పుడు పర్యటనల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులనే వాడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

First Published:  28 Nov 2019 8:54 PM GMT
Next Story