Telugu Global
NEWS

14400కు భారీగా ఫిర్యాదులు.... అత్యధికం రెవెన్యూ ఉద్యోగులపైనే....

ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన 14400 కాల్‌సెంటర్‌కు తొలి రోజు భారీ స్పందన వచ్చింది. కాల్‌సెంటర్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో ఐదువేల 100 కాల్స్ వచ్చాయి. కాల్‌ సెంటర్‌ నిజంగానే పనిచేస్తోందా? కాల్ సెంటర్ సిబ్బంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అని ఆరా తీసేందుకు కూడా చాలా మంది కాల్స్ చేశారు. తొలి రోజు వచ్చిన ఫిర్యాదుల్లో 283 ఫిర్యాదులను నేరుగా ఏసీబీ కార్యాలయానికి పంపించారు. ఫిర్యాదుల్లో అత్యధికం […]

14400కు భారీగా ఫిర్యాదులు.... అత్యధికం రెవెన్యూ ఉద్యోగులపైనే....
X

ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన 14400 కాల్‌సెంటర్‌కు తొలి రోజు భారీ స్పందన వచ్చింది. కాల్‌సెంటర్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో ఐదువేల 100 కాల్స్ వచ్చాయి. కాల్‌ సెంటర్‌ నిజంగానే పనిచేస్తోందా? కాల్ సెంటర్ సిబ్బంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అని ఆరా తీసేందుకు కూడా చాలా మంది కాల్స్ చేశారు.

తొలి రోజు వచ్చిన ఫిర్యాదుల్లో 283 ఫిర్యాదులను నేరుగా ఏసీబీ కార్యాలయానికి పంపించారు. ఫిర్యాదుల్లో అత్యధికం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చాయి. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. రెవెన్యూ శాఖపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. రిజిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖలపైనా ఎక్కువ ఫిర్యాదులు అందాయి.

కాల్‌ సెంటర్‌లో 24 గంటల పాటు 20 నుంచి 25 మంది సిబ్బంది షిప్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను జిల్లా, రేంజ్, రాష్ట్ర ఏసీబీలకు కాల్ సెంటర్‌ సిబ్బంది పంపిస్తున్నారు. ఫిర్యాదులపై చర్యల స్టేటస్‌ను కూడా పర్యవేక్షిస్తారు.

తొలిరోజు లంచాల డిమాండ్‌ చేసిన ఉదంతాలపై 103 ఫిర్యాదులు వచ్చాయి. అవినీతి అధికారులపై 76 ఫిర్యాదులు, పాస్‌పుస్తకం జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని 44 ఫిర్యాదులు, లోన్ ల మంజూరు, సిమెంట్ రోడ్ల ఏర్పాటు కోసం డబ్బు డిమాండ్ చేస్తున్నారంటూ 13 ఫిర్యాదులు తొలి రోజు వచ్చాయి.

ముఖ్యమంత్రి ప్రారంభించిన 14400 కాల్‌ సెంటర్‌కు వస్తున్న స్పందన ప్రజా చైతన్యానికి అద్దం పడుతోందని ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులు చేయడానికి ఏసీబీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని… నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఆపై అవినీతి ఉద్యోగుల భరతం పడతామని వెల్లడించారు.

ఫిర్యాదుదారుడి వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెల్లడించబోమని… ఫిర్యాదుదారుడి వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయని వివరించారు. ఫిర్యాదులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని… ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల, ఇతర కీలక కేసులపై 30 రోజుల్లోగా చర్యలు చేపడతామని విశ్వజిత్ వివరించారు.

First Published:  26 Nov 2019 9:48 PM GMT
Next Story