Telugu Global
NEWS

టీడీపీలో ఐదారుగురు ఉండేది అనుమానమే...

వచ్చే ఆరు నెలల్లో టీడీపీలో ఐదారుగురు ఎమ్మెల్యేలు మిగలడం కూడా అనుమానమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదా ఉంటుందో లేదో అనుమానమేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన వింటుంటే వారిలో ఐదారుగురైనా మిగిలేది అనుమానమేనని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నారా లోకేష్‌కు ఇక రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం అస్సలు ఉండదన్నారు. కేసుల నుంచైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే బీజేపీ చంక ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఐదు నెలల్లో అన్నీ అబద్దాలు, పుకార్లు ప్రచారం చేసేశారని… […]

టీడీపీలో ఐదారుగురు ఉండేది అనుమానమే...
X

వచ్చే ఆరు నెలల్లో టీడీపీలో ఐదారుగురు ఎమ్మెల్యేలు మిగలడం కూడా అనుమానమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదా ఉంటుందో లేదో అనుమానమేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన వింటుంటే వారిలో ఐదారుగురైనా మిగిలేది అనుమానమేనని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

నారా లోకేష్‌కు ఇక రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం అస్సలు ఉండదన్నారు. కేసుల నుంచైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే బీజేపీ చంక ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఐదు నెలల్లో అన్నీ అబద్దాలు, పుకార్లు ప్రచారం చేసేశారని… టీడీపీ మీడియా ఎంతగా గింజుకుంటున్నా ప్రజలు మాత్రం వారి కుయుక్తులను నమ్మడం లేదన్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు ఇంకా నాలుగున్నరేళ్ల పాటు ఎలా తట్టుకుంటారో అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

నారా లోకేష్‌కు జయంతికి, వర్థంతికే కాకుండా పెళ్లికి, నిశ్చితార్ధానికి కూడా తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఓడినప్పటికి కామెడీ పండించడంలో మాత్రం నారా లోకేష్ తన జోరును కొనసాగిస్తున్నారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.

First Published:  25 Nov 2019 5:21 AM GMT
Next Story