Telugu Global
NEWS

చంద్రబాబుకు షాక్: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే

అందరూ మరిచిపోయినా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాత్రం మరువలేదు. టీడీపీ అధినేత చంద్రబాబును వదలలేదు. తాజాగా చంద్రబాబుకు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి షాకిచ్చారు. సోమవారం సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసుపై పిటీషన్ దాఖలు చేశారు. 2017లోనే రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత ‘ఓటుకు నోటు’ విషయంలో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆనాడు సుప్రీం కోర్టులో ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి ఇవాళ పిటీషన్ దాఖలు చేశాడు. […]

చంద్రబాబుకు షాక్: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే
X

అందరూ మరిచిపోయినా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాత్రం మరువలేదు. టీడీపీ అధినేత చంద్రబాబును వదలలేదు. తాజాగా చంద్రబాబుకు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి షాకిచ్చారు. సోమవారం సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసుపై పిటీషన్ దాఖలు చేశారు.

2017లోనే రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత ‘ఓటుకు నోటు’ విషయంలో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆనాడు సుప్రీం కోర్టులో ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి ఇవాళ పిటీషన్ దాఖలు చేశాడు.

2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఎరచూపి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడు. ఇది వీడియోలకు చిక్కింది. ఈ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కొన్ని ఫోన్ సంభాషణల టేపులను విడుదల చేసింది. ఈ ఫోన్ సంభాషణల టేపులలో ఆనాటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఉంది. దీనిపై చంద్రబాబుకు పోలీసులు నోటీసులు కూడా పంపారు.

ఆ కేసు తర్వాత కాలంలో స్తబ్దుగా ఉండిపోయింది. ఈ కేసు విషయంలో దొరికిన చంద్రబాబును ఇరుకునపెట్టాలని 2017లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ ఇంకా లిస్టింగ్ కాలేదు. దీంతో ఇవాళ సుప్రీం కోర్టులో మరోసారి ఎర్లీ హియరింగ్ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై ఆళ్ల సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుపై చాలా కేసుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల తలుపులు తట్టారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఇలా ఇరుకునపెట్టారు.

First Published:  25 Nov 2019 5:44 AM GMT
Next Story