Telugu Global
National

కాంగ్రెస్ కు భారీ షాక్.... రాహుల్ ఏం చేస్తారు?

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రాహుల్ గాంధీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియా పాత్ర ఎంతో ఉంది. అయితే మెజార్టీ సీట్లు సాధించిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎంగా అందరూ కోరుకున్న పేరు జ్యోతిరాధిత్య సింధియానే. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియారిటీ పేరుతో కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా నియమించింది. దీనివెనుక సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంత్రాంగం ఉందన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ పీసీసీ […]

కాంగ్రెస్ కు భారీ షాక్.... రాహుల్ ఏం చేస్తారు?
X

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రాహుల్ గాంధీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియా పాత్ర ఎంతో ఉంది. అయితే మెజార్టీ సీట్లు సాధించిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎంగా అందరూ కోరుకున్న పేరు జ్యోతిరాధిత్య సింధియానే.

కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియారిటీ పేరుతో కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా నియమించింది. దీనివెనుక సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంత్రాంగం ఉందన్న అనుమానాలు బలపడ్డాయి.

అయితే తాజాగా మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా అందరూ ఊహించిన విధంగా జ్యోతిరాధిత్య సింధియా పేరును కాకుండా దివంగత నేత అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్ పేరును తెరపైకి తెచ్చారు. దీంతో తనకు సీఎం సీటు ఇవ్వక.. కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వకపోవడంపై సింధియా కలత చెందారు.

కాంగ్రెస్ కు నమ్మిన బంటుగా.. కాంగ్రెస్ అంటేనే సింధియా కుటుంబంగా మెదిలిన జ్యోతిరాధిత్య తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

తాజాగా సింధియా తన ట్విట్టర్ అకౌంట్ లో కాంగ్రెస్ నేత పేరును తొలగించడం సంచలనంగా మారింది. ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడని మాత్రమే సింధియా తన బయోడేటాలో పేర్కొన్నారు. ఇది మధ్యప్రదేశ్ రాజకీయాలతోపాటు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు సింధియాను వివరణ కోరగా.. ప్రజల సూచనతోనే తన బయోడేటాను మార్చానని చెప్పడం కొసమెరుపు..

సో ఇలా రాహుల్ నమ్మిన బంటు సింధియాకు కాంగ్రెస్ లో గౌరవం దక్కక వైదొలగాల్సి వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ల కింద నలిగిపోతున్న సింధియాను రాహుల్ సైతం కాపాడలేకపోతున్న వైన్యం ఆ పార్టీని వెంటాడుతోంది.

First Published:  25 Nov 2019 3:30 AM GMT
Next Story