Telugu Global
NEWS

ఎర్రబెల్లి కాన్వాయ్‌ కారు బోల్తా.... ఇద్దరు మృతి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏఆర్‌ కానిస్టేబుల్ పార్థసారథి, మంత్రి సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పూర్ణేందర్‌ ప్రాణాలు కోల్పోగా… అటెండర్, పీఏ, గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి పాలకుర్తికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకేసారి బయలుదేరినప్పటికీ… ప్రమాదానికి గురైన వాహనం మధ్యలో కొద్దిసేపు ఆగి ఆ తర్వాత బయలుదేరింది. ముందు వెళ్లిన వాహనాలను చేరుకునే క్రమంలో […]

ఎర్రబెల్లి కాన్వాయ్‌ కారు బోల్తా.... ఇద్దరు మృతి
X

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏఆర్‌ కానిస్టేబుల్ పార్థసారథి, మంత్రి సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పూర్ణేందర్‌ ప్రాణాలు కోల్పోగా… అటెండర్, పీఏ, గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్‌ నుంచి పాలకుర్తికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకేసారి బయలుదేరినప్పటికీ… ప్రమాదానికి గురైన వాహనం మధ్యలో కొద్దిసేపు ఆగి ఆ తర్వాత బయలుదేరింది. ముందు వెళ్లిన వాహనాలను చేరుకునే క్రమంలో వేగంగా వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెనక్కు వెళ్లి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

First Published:  23 Nov 2019 11:06 PM GMT
Next Story