Telugu Global
National

మహారాష్ట్ర పై సుప్రీం కీలక ఆదేశాలు

మహారాష్ట్ర రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది. పడ్నవీస్‌ చేత ప్రమాణస్వీకారం చేయించడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. విపక్షాల తరపున అభిషేక్ సంఘ్వీ, కపిల్ సిబల్‌ వాదనలు వినిపించారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని కపిల్ సిబల్ వాదించారు. కేబినెట్ నిర్ణయం తీసుకోకుండానే రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ అన్ని నిబంధనలను ఉల్లంఘించి పనిచేశారని ఆరోపించారు. బీజేపీకి మెజార్టీ ఉంటే ఈరోజే బలనిరూపణ చేసుకోవాలని విపక్షాలు సుప్రీం వద్ద సవాల్ చేశాయి. కేంద్రపెద్దల […]

మహారాష్ట్ర పై సుప్రీం కీలక ఆదేశాలు
X

మహారాష్ట్ర రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది. పడ్నవీస్‌ చేత ప్రమాణస్వీకారం చేయించడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. విపక్షాల తరపున అభిషేక్ సంఘ్వీ, కపిల్ సిబల్‌ వాదనలు వినిపించారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని కపిల్ సిబల్ వాదించారు. కేబినెట్ నిర్ణయం తీసుకోకుండానే రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు.

గవర్నర్ అన్ని నిబంధనలను ఉల్లంఘించి పనిచేశారని ఆరోపించారు. బీజేపీకి మెజార్టీ ఉంటే ఈరోజే బలనిరూపణ చేసుకోవాలని విపక్షాలు సుప్రీం వద్ద సవాల్ చేశాయి. కేంద్రపెద్దల ఆదేశాల ప్రకారం గవర్నర్ పనిచేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అవకాశం ఇస్తే శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూటమి ఈరోజే బలనిరూపణకు సిద్ధంగా ఉన్నాయని కోర్టుకు వివరించారు. అజిత్ పవార్ వెంట 41 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో చూపించాలన్నారు. గవర్నర్‌కు అజిత్ పవార్ తప్పుడు పత్రాలు ఇచ్చారని విపక్షాలు వాదించాయి.

బీజేపీ తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీం కోర్టుకు రావడం సరికాదని బీజేపీ వాదించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడినందున ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వాదించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు పడ్నవీస్, అజిత్ పవార్ లు గవర్నర్ కు అందించిన మద్దతు లేఖలను రాజ్ భవన్ నుంచి తీసుకుని కోర్టుకు సమర్పించాల్సిందిగా సోలిసిటర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేసింది. ఆ లేఖలను పరిశీలించిన తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

First Published:  24 Nov 2019 7:33 AM GMT
Next Story