Telugu Global
National

ఆర్టీసీ కార్మికుల విషయంలో.... కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఇదేనా?

ఆర్టీసీ సమ్మె విషయంలో తన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లిన కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు కేసీఆర్. డెడ్ లైన్ పెట్టినా చేరని కార్మికులు…. ఇప్పుడు చేరుతామని అంటున్నా తీసుకోవడం లేదు. దాదాపు 50 రోజులకు చేరువ అవుతున్నా ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యే సూచలు కనిపించడం లేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తామంటున్నా కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే కేసీఆర్ తాజాగా మధ్యప్రదేశ్ తరహాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే […]

ఆర్టీసీ కార్మికుల విషయంలో.... కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఇదేనా?
X

ఆర్టీసీ సమ్మె విషయంలో తన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లిన కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు కేసీఆర్. డెడ్ లైన్ పెట్టినా చేరని కార్మికులు…. ఇప్పుడు చేరుతామని అంటున్నా తీసుకోవడం లేదు. దాదాపు 50 రోజులకు చేరువ అవుతున్నా ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యే సూచలు కనిపించడం లేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తామంటున్నా కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

అయితే కేసీఆర్ తాజాగా మధ్యప్రదేశ్ తరహాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కార్మికులకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికులకు వాలంటరీ రిటైర్ మెంట్ ఆఫర్ (వీఆర్ఎస్) ఇవ్వబోతున్నారని సమాచారం.

ఈ స్వచ్ఛంద పదవీ విరమణను ఆర్టీసీలో అమలు చేసేందుకు నిర్ణయించారని తెలిసింది… ఆర్టీసీలో 50ఏళ్లకు పైబడిన వారు.. ఉద్యోగంపై ఆసక్తి లేని వారికి వీఆర్ఎస్ ఇచ్చి సెటిల్ చేసి సాగనంపేయాలని.. ప్రైవేటీకరణకు బాటలు వేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే కేసీఆర్ ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ ప్రతిపాదనను అమలు చేయడానికి ఆస్కారం లేదు. సమ్మె ముగిశాక కేసీఆర్ ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తారట.. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులకు షాకిచ్చేలా కేసీఆర్ తీసుకొస్తున్న ఈ వీఆర్ఎస్ ఎఫెక్ట్ ఆర్టీసీని ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఆర్టీసీలోని సగం అంటే 5100 బస్సులను ప్రైవేటుకిచ్చిన కేసీఆర్…. దాదాపు 30శాతం వరకూ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టంచేశారు. హైకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 49,733 మంది కార్మికులున్నారు. వీరిలో 50 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 7వేల మందికి పైగా ఉన్నారట…. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న వారిని, ఉద్యోగంపై ఆసక్తి లేని వారిని కలుపుకొని దాదాపు 27వేల మందికి వీఆర్ఎస్ ఇచ్చి సాగనంపాలని కేసీఆర్ సర్కారు ప్లాన్ చేస్తోందట.

First Published:  24 Nov 2019 3:05 AM GMT
Next Story