Telugu Global
NEWS

పాంటింగ్ సరసన విరాట్ కొహ్లీ

కెప్టెన్ గా కొహ్లీ 41 శతకాల రికార్డు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విజయాలలోనూ, పరుగులు సాధించడంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ రెండోరోజు ఆటలో శతకం సాధించడం ద్వారా…పింక్ బాల్ టెస్టులో సెంచరీ సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మొత్తం 156 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలతో 100 పరుగులు సాధించడం ద్వారా కొహ్లీ తన టెస్ట్ కెరియర్ లో 27వ […]

పాంటింగ్ సరసన విరాట్ కొహ్లీ
X
  • కెప్టెన్ గా కొహ్లీ 41 శతకాల రికార్డు

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విజయాలలోనూ, పరుగులు సాధించడంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ రెండోరోజు ఆటలో శతకం సాధించడం ద్వారా…పింక్ బాల్ టెస్టులో సెంచరీ సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

మొత్తం 156 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలతో 100 పరుగులు సాధించడం ద్వారా కొహ్లీ తన టెస్ట్ కెరియర్ లో 27వ శతకం సాధించాడు. 84వ టెస్టులో కొహ్లీ 27 సెంచరీలతో సహా అత్యంత వేగంగా 5వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్ గాచరిత్ర సృష్టించాడు. టెస్ట్ మ్యాచ్ ల్లో కెప్టెన్ గా కొహ్లీకి ఇది 20వ సెంచరీగా రికార్డుల్లో చేరింది. వన్డేల్లో కెప్టెన్ గా 21 శతకాలు సాధించిన కొహ్లీ…టెస్టుల్లో 20 శతకాలు నమోదు చేశాడు.

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్ మొత్తం 25 టెస్టు శతకాలతో…అత్యధిక సెంచరీలు బాదిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ రికార్డును సైతం రానున్న కాలంలో కొహ్లీ అధిగమించే అవకాశాలున్నాయి.

ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికార్డును విరాట్ కొహ్లీ సమం చేశాడు. పాంటింగ్, కొహ్లీ ఇద్దరూ తమతమ జట్ల తరపున చెరో 41 సెంచరీలు సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచారు.

విరాట్ కొహ్లీ తన 11 సంవత్సరాల క్రికెట్ కెరియర్ లో ఇప్పటి వరకూ 70 అంతర్జాతీయ శతకాలు సాధించడం విశేషం.

First Published:  24 Nov 2019 7:47 AM GMT
Next Story