Telugu Global
NEWS

ఏపీ స్కూళ్లలో ఇకపై వాటర్ బెల్

విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం… విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి శనివారం నో బ్యాగ్‌ డేగా ప్రకటించారు. ఇప్పుడు వాటర్‌ బెల్‌ను తీసుకొస్తున్నారు. స్కూళ్లలో పిల్లలు సరిపడ నీరు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మెడికల్‌ రిపోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వాటర్‌ బెల్‌ను తీసుకొస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. స్కూళ్లలో పిల్లలు […]

ఏపీ స్కూళ్లలో ఇకపై వాటర్ బెల్
X

విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం… విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి శనివారం నో బ్యాగ్‌ డేగా ప్రకటించారు. ఇప్పుడు వాటర్‌ బెల్‌ను తీసుకొస్తున్నారు.

స్కూళ్లలో పిల్లలు సరిపడ నీరు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మెడికల్‌ రిపోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వాటర్‌ బెల్‌ను తీసుకొస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.

స్కూళ్లలో పిల్లలు నీరు తాగకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, జీర్ణ సమస్యలు ఎదురవుతున్నాయి. సరైన బాత్‌రూములు లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా నీరు తాగడం లేదు. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటర్‌ బెల్‌ ఆదేశాలు ఇచ్చారు. మధ్యమధ్యలో వాటర్‌ బెల్‌ ద్వారా గుర్తు చేసి పిల్లలకు నీరు తాగించడం ఈ ఆలోచన ఉద్దేశం.

ఇప్పటికే కేరళ, తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల వయసును బట్టి రోజుకు మూడు లీటర్ల వరకు నీరు తాగేలా చూడాలని టీచర్లకు సూచనలు ఇస్తున్నారు.

First Published:  23 Nov 2019 11:04 PM GMT
Next Story