Telugu Global
National

నిట్టనిలువునా చీలిన కురువృద్ధుడి పార్టీ ?

మహారాష్ట్ర రాజకీయంపై బీజేపీ బలప్రయోగం చేసింది. మొన్నటి వరకు తమకు మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని తప్పుకున్న బీజేపీ… హఠాత్తుగా ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. గవర్నర్‌ కూడా ఇందుకు బాగానే సహకరించారు. డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. దాంతో బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు ఇచ్చిందా? లేక ఎన్‌సీపీ చీలిపోయిందా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. బీజేపీకి తమ పార్టీ నేత అజిత్ పవార్‌ మద్దతు […]

నిట్టనిలువునా చీలిన కురువృద్ధుడి పార్టీ ?
X

మహారాష్ట్ర రాజకీయంపై బీజేపీ బలప్రయోగం చేసింది. మొన్నటి వరకు తమకు మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని తప్పుకున్న బీజేపీ… హఠాత్తుగా ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. గవర్నర్‌ కూడా ఇందుకు బాగానే సహకరించారు.

డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. దాంతో బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు ఇచ్చిందా? లేక ఎన్‌సీపీ చీలిపోయిందా? అన్న దానిపై చర్చ జరుగుతోంది.

బీజేపీకి తమ పార్టీ నేత అజిత్ పవార్‌ మద్దతు ఇవ్వడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంపై శరద్‌ పవార్ స్పందించారు. అజిత్‌ పవార్‌ బీజేపీతో చేతులు కలపడం పార్టీ నిర్ణయం కాదని ప్రకటించారు.

బీజేపీలో కలవాలన్నది ఎన్‌సీపీ నిర్ణయం కాదని వెల్లడించారు. రాజకీయ కురువృద్ధుడిగా చెప్పుకునే శరద్‌ పవార్‌కు చెందిన ఎన్‌సీపీని బీజేపీ నిట్టనిలువుగా చీల్చింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అజిత్ పవార్‌ వెంట 22 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఎన్‌సీపీ రెబల్స్‌, ఇండిపెండెంట్లతో పాటు శివసేన నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు, ఎన్‌సీపీకి 54 మంది, శివసేనకు 56 మంది, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

First Published:  23 Nov 2019 12:18 AM GMT
Next Story