Telugu Global
Cinema & Entertainment

‘సరిలేరు’లో మహేష్ డైలాగ్స్.. అల్లు అర్జున్ మీద పంచేనా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో పోటీ రంజుగా ఉంది. జనవరి 12నే మహేశ్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’తో పోటీగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ రిలీజ్ అవుతోంది. దీంతో ఇద్దరి అగ్రహీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తద్వారా కలెక్షన్లు తగ్గుతాయని.. ఇద్దరికీ నష్టం అని.. ఎవరో ఒకరు డ్రాప్ కావాలని కోరుకుంటున్నారు. ఇక మహేష్ బాబు ‘సరిలేరు’ టీజర్ రోజునే పోటీగా బన్నీ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ […]

‘సరిలేరు’లో మహేష్ డైలాగ్స్.. అల్లు అర్జున్ మీద పంచేనా?
X

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో పోటీ రంజుగా ఉంది. జనవరి 12నే మహేశ్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’తో పోటీగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ రిలీజ్ అవుతోంది. దీంతో ఇద్దరి అగ్రహీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తద్వారా కలెక్షన్లు తగ్గుతాయని.. ఇద్దరికీ నష్టం అని.. ఎవరో ఒకరు డ్రాప్ కావాలని కోరుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు ‘సరిలేరు’ టీజర్ రోజునే పోటీగా బన్నీ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ పాటను సరిగ్గా గంట ముందు రిలీజ్ చేశారు. ఇలా మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ సినిమాలు ఎక్కడా తగ్గడం లేదు. రెండు యూనిట్లు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి.

అయితే తాజాగా మహేష్ టీజర్ లో పలికిన డైలాగ్స్ కొత్త వివాదానికి దారితీసాయి. సంక్రాంతికి తనతోపాటు పోటీపడుతున్న అల్లు అర్జున్ సినిమాపైనే ఈ పంచ్ లు అన్న గుసగుసలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.

అప్పట్లో మహేష్ బాబు ఆగడు సినిమాలో పలికిన ‘ప్రతీవోడు పులులు, సింహాలు, ఏనుగులతో వెదవ పోల్చుకోవడాలు’ డైలాగ్ దుమారం రేపింది. నందమూరి హీరోలపైనే ఈ డైలాగ్ అని వివాదాస్పదమైంది.

తాజాగా ‘సరిలేరు’ టీజర్ లో కూడా మహేష్ పలికిన డైలాగ్ దుమారం రేపుతోంది. జనవరి12న తనతోపాటు పోటీపడుతన్న అల్లు అర్జున్ మూవీ గురించే ఈ డైలాగ్ అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

‘భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాలు లేవమ్మా’ అన్న మహేష్ డైలాగ్ తో సంక్రాంతి బరిలో వెనక్కి తగ్గేది లేదని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పాడని సినీ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

ఇక ప్రకాశ్ రాజ్ తో పలికించిన ‘ప్రతి సంక్రాంతికి అల్లుల్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మాత్రం మొగుడొస్తున్నాడు’ అన్న డైలాగ్ కూడా సంక్రాంతి బరిలో మహేష్ తో పోటీపడుతున్న తోటి హీరోలపై పంచ్ గానే భావిస్తున్నారు.

సో మరి మహేష్ తొడగొట్టాడు. దీనికి అల్లు అర్జున్, ఇతర సినిమాల వారు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాలి.

First Published:  23 Nov 2019 1:12 AM GMT
Next Story