Telugu Global
NEWS

సీఎం రమేష్‌ కుమారుడి వివాహంపై బాబు తర్జనభర్జన

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన సీఎం రమేష్ కుమారుడి వివాహం ఈ నెల 24న దుబాయ్‌లో జరగబోతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కళ్లు చెదిరే రేంజ్‌లో ఈ వివాహం చేయబోతున్నారు. అంత ఖర్చు పెట్టి ఇండియాలో పెళ్లి చేస్తే అది రాజకీయ దుమారానికి తావిస్తుందన్న ఉద్దేశంతో సీఎం రమేష్ రూట్‌ మార్చి దుబాయ్‌లో పెళ్లి పెట్టుకున్నారు. చాలా మంది బీజేపీ ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పంపారు. కాకపోతే కేంద్రమంత్రి […]

సీఎం రమేష్‌ కుమారుడి వివాహంపై బాబు తర్జనభర్జన
X

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన సీఎం రమేష్ కుమారుడి వివాహం ఈ నెల 24న దుబాయ్‌లో జరగబోతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కళ్లు చెదిరే రేంజ్‌లో ఈ వివాహం చేయబోతున్నారు. అంత ఖర్చు పెట్టి ఇండియాలో పెళ్లి చేస్తే అది రాజకీయ దుమారానికి తావిస్తుందన్న ఉద్దేశంతో సీఎం రమేష్ రూట్‌ మార్చి దుబాయ్‌లో పెళ్లి పెట్టుకున్నారు.

చాలా మంది బీజేపీ ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పంపారు. కాకపోతే కేంద్రమంత్రి హరిదీప్ సింగ్‌ కుమార్తె వివాహం కూడా అదే సమయంలో ఉండడంతో బీజేపీ ఎంపీలు దుబాయ్‌ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. పైగా దుబాయ్‌ వెళ్లేందుకు పార్టీ పెద్దల నుంచి బీజేపీ ఎంపీలకు అనుమతి అంత ఈజీ కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

పలువురు రాజకీయ ప్రముఖుల పిల్లల వివాహాలు కూడా వీకెండ్‌లో ఉన్నాయి. దాంతో ఎవరు హాజరవుతారన్న దానిపై చర్చ జరుగుతోంది. తన రాజకీయ గురువు చంద్రబాబుకు కూడా సీఎం రమేష్ ఆహ్వానించారు.. పలువురు టీడీపీ ప్రముఖులు ఆహ్వానం అందుకున్నారు. కాకపోతే వివాహానికి వెళ్లాలా… వద్దా… అని తర్జనభర్జన పడ్డ చంద్రబాబు… దుబాయ్‌కి వెళ్లకపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం.

పార్టీ ఫిరాయించిన ఎంపీ కుమారుడి వివాహానికి వెళ్తే… తానే సీఎం రమేష్‌ను బీజేపీలోకి పంపించానన్న ప్రచారానికి మరింత బలం ఇచ్చినట్టు అవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు వెనక్కు తగ్గినట్టు చెబుతున్నారు. మిగిలిన టీడీపీ నేతలు సీఎం రమేష్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది.

First Published:  23 Nov 2019 1:25 AM GMT
Next Story