Telugu Global
NEWS

ఏపీలో బార్ల లైసెన్సులు రద్దు.. మద్యం ధరలు భారీగా పెంపు..!

సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా ఏపీలో అమలు చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం అమలు మరింత విస్తృత రూపంలోకి మారనుంది. ఇప్పటికే కొత్త మద్యం విధానం ద్వారా వైన్ షాపుల సంఖ్యను తగ్గించడమే కాకుండా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు, మద్యం ధరల పెంపు వంటివి అమలు చేసింది. ఇక ఇప్పుడు బార్ల వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బార్ల లైసెన్సులన్నింటినీ రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో […]

ఏపీలో బార్ల లైసెన్సులు రద్దు.. మద్యం ధరలు భారీగా పెంపు..!
X

సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా ఏపీలో అమలు చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం అమలు మరింత విస్తృత రూపంలోకి మారనుంది. ఇప్పటికే కొత్త మద్యం విధానం ద్వారా వైన్ షాపుల సంఖ్యను తగ్గించడమే కాకుండా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు, మద్యం ధరల పెంపు వంటివి అమలు చేసింది.

ఇక ఇప్పుడు బార్ల వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బార్ల లైసెన్సులన్నింటినీ రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 797 బార్లకు (స్టార్ హోటల్స్ మినహా) ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అలాగే శనివారం నుంచి బార్లలో మద్యం ధరలను కూడా భారీగా పెంచుతూ విడిగా వేరే ఉత్తర్వులు జారీ చేసింది.

అంతే కాకుండా 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉండే కొత్త బార్ల పాలసీకి సంబంధించి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త బార్ల పాలసీ ప్రకారం ప్రస్తుతం ఉన్న 797 బార్లలో కేవలం 40 శాతం అంటే 319 బార్లకు మాత్రమే జనవరి 1 తర్వాత లైసెన్సులు మంజూరు కానున్నాయి.

బార్ల లైసెన్సు కోసం పెట్టుకునే దరఖాస్తు రుసుమును 2 నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. మరో వైపు రిజిస్ట్రేషన్ రేటు 8 లక్షల రూపాయల స్లాబును 20 లక్షలకు, గరిష్ట స్లాబైన 28 లక్షలను 70 లక్షల రూపాయలకు పెంచారు. ఇక లైసెన్సు రుసుము 2 లక్షల నుంచి 5 లక్షలు చేశారు.

త్రీస్టార్ కంటే పెద్ద హోటల్స్, మైక్రోబ్రూవరీలకు లైసెన్సు, రిజిస్ట్రేషన్ రుసుము కలిపి 1.50 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

అంతే కాకుండా ఇకపై బార్లు ఉదయం 11 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచిఉంచాలనే నిబంధన విధించారు.

First Published:  22 Nov 2019 9:04 PM GMT
Next Story