Telugu Global
NEWS

హైదరాబాద్ లో టీ-20, విశాఖలో వన్డే

విండీస్ తో సిరీస్ కు భారతజట్టు టీ-20 జట్టులో భువీ, షమీ ప్రపంచకప్ కు సన్నాహకంగా వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20, వన్డే సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లను … ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత ఎంపిక సంఘం కోల్ కతాలో ప్రకటించింది. ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరంగా ఉన్న స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు తిరిగి టీ-20 జట్టులో చోటు కల్పించారు. సూపర్ ఫామ్ లో […]

హైదరాబాద్ లో టీ-20, విశాఖలో వన్డే
X
  • విండీస్ తో సిరీస్ కు భారతజట్టు
  • టీ-20 జట్టులో భువీ, షమీ

ప్రపంచకప్ కు సన్నాహకంగా వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20, వన్డే సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లను … ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత ఎంపిక సంఘం కోల్ కతాలో ప్రకటించింది.

ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరంగా ఉన్న స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు తిరిగి టీ-20 జట్టులో చోటు కల్పించారు.

సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీనిసైతం టీ-20 జట్టులో చేర్చారు.

ముంబై ఆల్ రౌండర్ శివం దూబేకు వన్డే సిరీస్ లో ఆడే అవకాశం కల్పించారు. రెండు ఫార్మాట్లలోనూ భారతజట్లకు విరాట్ కొహ్లీనే నాయకత్వం వహించనున్నాడు.

ఇదీ వన్డే జట్టు…

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, రాహుల్, రిషభ్ పంత్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివం దూబే, యజువేంద్ర చహాల్, కుల్దీబ్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చహార్.

టీ-20 జట్టు….

విరాట్ కొహ్లీ ( కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్,దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.

హైదరాబాద్ లో మూడో టీ-20

డిసెంబర్ 6న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ కు ముంబై ఆతిథ్యమిస్తుంది. సిరీస్ లోని రెండో మ్యాచ్ ను డిసెంబర్ 8న తిరువనంతపురంలోనూ, 11న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనూ నిర్వహిస్తారు.

15 నుంచి వన్డే సిరీస్…

డిసెంబర్ 15న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. 18న విశాఖలో రెండు, కటక్ లో డిసెంబర్ 22న మూడు వన్డేలు నిర్వహించనున్నారు.

First Published:  22 Nov 2019 5:30 AM GMT
Next Story